గుంటూరు

వేసవి దృష్ట్యా మరిన్ని చలివేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కార్పొరేషన్), ఏప్రిల్ 25: నగరంలో ఎండ తీవ్రత పెరిగిపోతున్నందున నగరంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాలు సరిపోవడం లేదని వాటిని సంఖ్యను పెంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌లో ఇంజనీరింగ్ అధికారులతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నగరంలో చలివేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే 50 చలివేంద్రాలను ఏర్పాటుచేసినప్పటికీ నగరంలోని ప్రధాన కూడళ్లలో మరియు ట్రాఫిక్ రద్దీ ఉన్న 16 ప్రాంతాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుండి 5 గంటల వరకు మంచినీరు, ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేయాలని ఆదేశించారు. అలాగే అత్యవసర సమయాల్లో వినియోగించుకునేందుకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అం దుబాటులో ఉంచాలని, చలివేంద్రాల పర్యవేక్షణకు ప్రత్యేక నోడల్ ఆఫీసర్‌ను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ ఈ గోపాలకృష్ణారెడ్డి, ఈ ఈలు రాంనాయక్, చిన కోటేశ్వరరా వు, లక్ష్మయ్య, డి ఈలు తదితరులు పాల్గొన్నారు.