గుంటూరు

సేవాస్ఫూర్తితో ముందుకెళ్దాం:

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 19: ఎబివిపి కార్యకర్తలు క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో వ్యవహరించి దేశానికి ఆదర్శంగా నిలిచేలా సేవా కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి, బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ ప్రకాష్ నడ్డా కోరారు. ఎబివిపి 33వ రాష్ట్ర మహాసభలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రకాష్‌నడ్డా వలంటీర్లనుద్దేశించి మాట్లాడారు. స్థానిక గుంటూరు మెడికల్ హాస్టల్‌లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నగర్ వేదికపై నుంచి ప్రకాష్ నడ్డా ప్రసంగించారు. 1976 నుంచి 1990 వరకు ఎబివిపి కార్యకర్తగా పనిచేశానన్నారు. దేశాన్ని ఐక్యంగా నడిపించేందుకు కృషిచేసే శక్తిని, ఆలోచనాదృక్పథాన్ని ఎబివిపి ద్వారానే తాను పుణికిపుచ్చుకున్నానని అన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ దేశానికి వారసత్వ రాజకీయాలు అవసరం లేదని జవసత్వ రాజకీయాలు కావాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యావేత్త మాత్రమే కాదని, సంస్కరణ వాది, అచంచల దేశభక్తి గల వ్యిక్తిగా అభివర్ణించారు. రాజకీయ నాయకుల్లో కులపిచ్చి కన్నా కుర్చీపిచ్చే ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించారు. సామాన్యులు సైతం అసామాన్యమైన స్థానాన్ని చేజిక్కించుకునే అవకాశముందని ప్రధాని నరేంద్రమోదీ నిరూపించారన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత ప్రచారక్ భారత్‌జీ మాట్లాడుతూ ఎదుటివాడి తప్పును వేలెత్తి చూపడం కన్నా సవరించడం గొప్పధర్మం అన్నారు. కులరహిత సమాజం మాటలు, చట్టాల ద్వారా రాదని, ఆచరణాత్మకంగా వ్యవహరిస్తేనే సాధ్య పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు మాలెంపాటి తిరుమలరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున, విజయనగరం కార్యనిర్వాహణ కార్యదర్శి వీరేష్ తదితరులు పాల్గొన్నారు. సభకు అఖిల భారత సంఘటన కార్యదర్శి సునీల్ అంబేకర్ ముఖ్యులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎబివిపి నూతన సంవత్సర క్యాలెండర్‌ను ప్రముఖులు ఆవిష్కరించారు.

కనుల పండువగా రుక్మిణీ కల్యాణం

జగుంటూరు (కల్చరల్), డిసెంబర్ 19: భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞ మమోత్సవం పూరె్తైన సందర్భంగా శనివారం నగరంలోని శ్యామలానగర్ శ్రీ గాయత్రీ గణేష్ సంతోషిమాత దేవాలయంలో రుక్మిణీ శ్రీ కృష్ణ కల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా పట్ట్భాపురం వేద పరిషత్, దేవాలయ పాలకవర్గం అధ్వర్యాన నిర్వహించారు. ప్రప్రథమంగా ఉత్సవ మూర్తులను సంప్రదాయబద్ధంగా అలంకరించి కల్యాణ వేదికకు తోడ్కొనివచ్చారు. వేద పండితులు సామవేదంలోని పనసలను పఠిస్తుండగా కల్యాణతంతును రమణీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఉత్సవంలో వేద పరిషత్ అధ్యక్షులు గబ్బిట శివరామకృష్ణ ప్రసాద్, పరిషత్ కార్యదర్శి తాడేపల్లి వేంకట సింహాద్రిశాస్ర్తీ, దేవాలయం పక్షాన జివైఎన్ బాబు, వడ్లమాని కుటుంబ సభ్యులు పెద్దసంఖ్యలో భక్తులు రుక్మిణీ శ్రీ కృష్ణమూర్తులను సేవించుకున్నారు. భక్తజనానికి కల్యాణ ప్రసాదాన్ని అందజేశారు.