గుంటూరు

నేడు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు ద్విశతాబ్ది ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 16: బ్రిటీష్ పాలకులపై భారతదేశంలోనే తొలిసారిగా కత్తికట్టిన పోరాట యోధుడు రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు ద్వి శతాబ్ది ఉత్సవాలు శుక్రవారం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగనున్నాయి. కృష్ణాడెల్టా సంస్థానంగా వెంకటాద్రినాయుడు అమరావతి ధరణికోట కేంద్రంగా (1783-1816) పాలించారు. విగ్రహారాధనలో భాగంగా చేబ్రోలు, చింతపల్లి, కృష్ణాజిల్లాలోని పలు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అమరావతిలోని ప్రాచీన ఆలయాలను ఆధునికీకరించారు. మంగళగిరి గాలిగోపురం ఆయన నిర్మించిందే. వేలాది మంది సైనికులు, గజ, అశ్విక దళాలతో వెంకటాద్రినాయుడు సంస్థానం పరిఢవిల్లింది. ప్రస్తుతం అమరావతి అమరలింగేశ్వరాలయానికి సంబంధించిన సదావర్తి సత్రానికి ఇనాంగా చెన్నయ్‌లో భూములు ఇచ్చిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఈ ప్రాంతంలో ఇతోధికంగా దానాలిచ్చారు. ఆయన ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా జీవిత చరిత్ర సంగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి సుప్రీం కోర్టు జస్టిస్ చలమేశ్వర్, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు.

మహిళాభ్యున్నతికి పాటుపడిన మహోన్నతుడు ఎన్టీఆర్

* ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప
గుంటూరు (కొత్తపేట), సెప్టెంబర్ 16: రాష్ట్రంలో మొదటిసారిగా మహిళా అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి దివంగత నందమూరి తారక రామారావు అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థుల సర్ట్ఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమం శుక్రవారం గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని నెహ్రూనగర్‌లో మద్దాళి గిరిధర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు హోం మంత్రి చినరాజప్ప, వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు అతిథులుగా విచ్చేసి మహిళలకు కుట్టుమిషన్లు, ఆటోలను అందజేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారిని ప్రోత్సహిస్తున్నారన్నారు. మహిళలు పొందిన శిక్షణ ద్వారా ఆయా రంగాల్లో రాణించాలని, వారికి ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. డిఆర్‌డిఎ, మెప్మా ప్రాజెక్టుల ద్వారా ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆదాయ వనరులను పెంపొందించుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలనే లక్ష్యంతో మరుగుదొడ్డి లేని వారికి నిర్మించి ఇస్తున్నారన్నారు. వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా పక్షపాతి అని, వారి అభివృద్ధికి డ్వాక్రా రుణాలు మంజూరు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం జరిగిన శిక్షణా తరగతుల్లో 650 మంది మహిళలకు ఉచితంగా కుట్టులో, 18 మందికి ఆటోడ్రైవింగ్‌లో శిక్షణ అందించామన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఇంటి ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకుని, పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జివి ఆంజనేయులు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్ కృష్ణకపర్థి, డిటిసి రాజారత్నం, ఆయా శాఖల అధికారులు సింహాచలం, ఎం ఏసుదాసు తదితరులు పాల్గొన్నారు.

జెండాలు మోయడానికేనా.. పదవులకు పనికిరామా?
* ఇలాగైతే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలా గెలుస్తాం * డెప్యూటీ సిఎం ఎదుట తెలుగుతమ్ముళ్ల ఆగ్రహం
* కొత్తవారికి ప్రాధాన్యతపై మండిపాటు * పరిధి దాటితే క్రమశిక్షణ చర్యలు: మంత్రి ప్రత్తిపాటి
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, సెప్టెంబర్ 16: గుం టూరు అర్బన్ తెలుగుదేశం పార్టీలో అసమ్మతి వెల్లువెత్తుతోంది. పార్టీకి అంకితభావంతో పనిచేసిన తమను పక్కనపెట్టి కొత్తవారిని అందలమెక్కిస్తున్నారని శుక్రవారం జరిగిన అర్బన్ పార్టీ సమీక్షా సమావేశంలో పలువురు ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, డెప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డిపై కొందరు కార్యకర్తలు అభియోగాలు మోపుతూ తమను దూరంగా ఉంచుతున్నారని దీనివల్ల వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో తమకు సీట్లు కూడా వస్తాయనే ఆశలు సన్నగిల్లాయని అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మోదుగుల ప్రత్యేక కోటరీలో ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని వాదనకు దిగారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచింది. ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులు లేవు.. కనీసం పార్టీ పదవులయినా దక్కలేదు.. ఇటీవల వలస వచ్చిన వారికి ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు.. గత దశాబ్దాల కాలంగా జెండా పట్టుకుని అంకితభావంతో పార్టీకి పనిచేస్తే ఇదా మాకు మిగిలేదని ప్రశ్నించారు. ఇలాగైతే కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ గెలుపు అసాధ్యమని తేల్చిచెప్పారు. దీంతో మంత్రి ప్రత్తిపాటి జోక్యం చేసుకుని పార్టీని అంటిపెట్టుకుని పనిచేసే వారికి అన్యాయం జరగదని, ఏవైనా ఉంటే సమన్వయంతో చర్చించుకోవాలని దూకుడుగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. గుంటూరు నగరపాలక సంస్థకు మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు భేదాభిప్రాయాలు విడనాడి గెలుపు కోసం పనిచేయాలని డెప్యూటీ సిఎం చినరాజప్ప కోరారు. పార్టీలో సీనియర్లుగా తమకు ఓ గుర్తింపు కూడా లేకుండా పోయిందని మరోసారి కార్యకర్తలు చినరాజప్ప దృష్టికి తెచ్చారు. వలసలకు ప్రాధాన్యత పెరిగిందని ఆరోపించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చాక పదవులిస్తామని ఆశచూపుతారు.. వచ్చినతరువాత విస్మరిస్తారని ధ్వజమెత్తారు. కౌన్సిలర్ల ఎంపికలో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన చినరాజప్ప ఈ ఏడాది చివర్లో కార్పొరేషన్ ఎన్నికలు జరపాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, కార్యకర్తలు, ఆశావహులు పార్టీ పటిష్ఠతకు శ్రమించాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారమే ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. సమావేశానికి మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, జిల్లా పార్టీ అధ్యక్షుడు జివి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, తెనాలి శ్రావణ్‌కుమార్, మోదుగుల వేణుగోపాలరెడ్డి, మన్నవ సుబ్బారావు, జెఆర్ పుష్పరాజ్, యాగంటి దుర్గారావు, మాకినేని పెదరత్తయ్య, చందు సాంబశివరావు, శనక్కాయల అరుణ, అర్బన్ బ్యాంక్ చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్, మద్దాళి గిరిధర్ తదితరులు హాజరయ్యారు.

రోగుల ప్రాణాలతో చలగాటమాడుతున్న
వైద్యులపై చర్యలు తీసుకోవాలి
* ఆసుపత్రి ముందు ధర్నాలో రోగుల బంధువులు
తెనాలి, సెప్టెంబర్ 16: గుంటూరు జిల్లాలో పెద్ద ఆసుపత్రుల్లో ఒకటైన తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు గర్భిణులకు సక్రమంగా ఆపరేషన్ చేయలేక వారి ప్రాణాలతో చలగాటమాడుతున్నారని, అటువంటి వారిపై రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖా మంత్రి చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు చిలకా కిరణ్‌మాదిగ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల బంధువులతో కలిసి ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ఆసుపత్రిలో కాన్పుకోసం వచ్చిన గర్భిణులకు పెద్దపరేషన్‌చేసి బిడ్డను బయటకుతీసి కుట్లు వేసిన వైద్యులు 20 రోజుల తరువాత కుట్లకు ఇన్‌ఫెక్షన్ సోకిందనే సాకుతో మరోమారు ఆపరేషన్‌చేసి కుట్లు వేయాలంటూ రోగులతో చెలగాటమాడుతున్నారని బంధువులు తమ దృష్టికి తీసుకువచ్చారని కిరణ్‌మాదిగ చెప్పారు. ఈమేరకు శుక్రవారం ఆసుపత్రిలో ఆ స్థితిలోవుండి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించిన ఆయన మాట్లాడుతూ పేదలైన గర్భిణులు ప్రభుత్వ వైద్యాన్ని నమ్మి ఆసుపత్రులకువస్తే ఇక్కడి వైద్యులు పైవిధంగా వారి ప్రాణాలతో చెలగాటమాడుతన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో 140 మంది గర్భిణులకు పెద్ద ఆపరేషన్‌చేయగా అందులో 16మందికి ఇన్‌ఫెక్షన్ సోకిందనే పేరుతో మరోమారు ఆపరేషన్ చేయాలని చెబుతున్నారన్నారు. ఈవిషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సులోచన దృష్టికి తీసుకువెళ్ళగా ఇన్‌ఫెక్షన్ సోకినవారికి తిరికి కుట్లు వేస్తామని వైద్యులు చెప్పిన విషయం తనకు తెలియదన్నారు. విచారణ జరిపి సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు కిరణ్‌మాదిగ పేర్కొన్నారు. అయితే తెనాలి వైద్యశాలలో ఇటువంటి సంఘటనలు సర్వసాధారణంగా మారాయని, గతంలోనూ అనేక మంది గర్భిణులు పలువిధాగాలు ఆపరేషన్లు చేయించుకుని ఇబ్బందులు ఎదుర్కోగా మరోమహిళ మృతి చెందిన విషయాన్ని ఈసందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖా మంత్రి స్పందించి ఆపరేషన్ చేసిన వైద్యులపై చర్యలు తీసుకుని గర్భిణులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బోస్‌బాబు, రాజేష్, కార్యకర్తలు, రోగుల బంధువులు ఉన్నారు.

యాజమాన్య హామీతో నర్సుల ఆందోళన విరమణ
మంగళగిరి, సెప్టెంబర్ 16: గడిచిన దశాబ్దకాలానికి పైగా ఎన్నారై ఆస్పత్రిలో సేవలందిస్తున్న నర్సులతో వెట్టి చాకిరీ చేయించు కుంటున్నారని, వేతనాలు పెంచడం లేదని ఎన్నారై స్ట్ఫా అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వై గంగాధరరావు ధ్వజమెత్తారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మండల పరిధిలోని చినకాకాని ఎన్నారై ఆస్పత్రి ఎదుట శుక్రవారం రెండోరోజున కూడా నర్సులు పెద్దసంఖ్యలో ధర్నాకు దిగారు. ధర్నానుద్దేశించి గం గాధరరావు మాట్లాడుతూ ధర్నా జరుపుతున్న వారిని పోలీసులతో అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నామని సమస్యల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు. పోలీసులతో నేతలు వాగ్వివాదానికి దిగారు. యాజమాన్య ప్రతినిధులు నర్సింగ్ సిబ్బందిని చర్చలకు ఆహ్వానించి వేతనాల పెంపుకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. యూనియన్ నాయకులు మాధవి, సుజాత, శివకుమారి తదితరులు పాల్గొన్నారు.

గణేష్ ప్రతిమలకు వైభవంగా గ్రామోత్సవం
పెదకూరపాడు, సెప్టెంబర్ 16: మండలంలో ఈనెల 5వ తేదీ వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గత పది రోజులుగా శాస్త్రోక్తంగా పూజలందుకున్న గణేష్ ప్రతిమలకు గురువారం రాత్రి నుండి శుక్రవారం ఉదయం వరకు ఊరేగింపులు వైభవంగా జరిగాయి. 75 తాళ్లూరులో రామాలయం వద్ద ప్రత్యేక పూజలందుకున్న వినాయకుడిని కీసర రమణారెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది భక్తులు ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ప్రతిమను ఉంచి, మేళతాళాలతో ప్రదర్శన నిర్వహిస్తూ అమరావతి కృష్ణానదికి నిమజ్జనానికై తరలించారు. స్థానిక శ్రీ వినాయక స్వామి ఆలయంలో ఏర్పాటుచేసిన గణపతి ప్రతిమను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించిన వాహనంలో ఉంచి కనక తప్పెట్లు, బాణసంచా, చిన్నారుల కోలాట ప్రదర్శనల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. తెల్లవారుజామున అమరావతిలో నిమజ్జనం గావించారు.

అమరేశ్వరుని సేవలో వ్యవసాయ శాస్తవ్రేత్తలు
అమరావతి, సెప్టెంబర్ 16: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ శాస్తవ్రేత్తల బృందం శుక్రవారం సాయంత్రం అమరావతిలో విస్తృతంగా పర్యటించింది. డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ వశిష్ఠ, డాక్టర్ తిమోతి, డాక్టర్ దేవేంద్రకుమార్, డాక్టర్ కొట్టియాన్ తదితరులు అమరేశ్వర స్వామి దేవస్థానానికి చేరుకోగానే ఆలయ అధికారులు మేళతాళాలతో స్వాగతం పలికారు. ఈ బృందం బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఆలయ మర్యాదల్లో భాగంగా స్వామివారి శేషవస్త్రాలు బహూకరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఈ బృందం అమరావతిలో నిర్మాణం జరుగుతున్న ధ్యానబుద్ధ ప్రాజెక్టు, కాలచక్ర మ్యూజియం, పురావస్తు ప్రదర్శనశాలను సందర్శించి, ఇక్కడ గల బుద్ధుని జీవిత చరిత్రను తెలియజేసే శిల్పసంపదను తిలకించారు.

నగరాభివృద్ధికి ఏంచేశారో చెప్పండి
* టిడిపి నేతలకు అప్పిరెడ్డి ప్రశ్న
గుంటూరు, సెప్టెంబర్ 16: నగరపాలక సంస్థ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో అవాస్తవాలతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పేందుకు నగరవాసులు సిద్ధంగా ఉన్నారని వైసిపి రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అరండల్‌పేటలోని వైసిపి నగర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండున్నరేళ్ల కాలంలో గుంటూరు నగరాభివృద్ధికి సంబంధించి ఏమి సాధించారో చెప్పాలని ప్రశ్నించారు. కొత్తగా ఒక ఇల్లు గానీ, ఒక రేషన్‌కార్డు గానీ, పింఛన్ గానీ ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో తెలుగుదేశం నాయకులు కార్పొరేషన్ ఎన్నికలకు ఏ ముఖం ఎట్టుకుని ఓట్లు అడుగుతారంటూ ప్రశ్నించారు. టిడిపి ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజలపై పన్నుల భారం మోపడం ఆనవాయితీగా వస్తుందన్నారు. విలీన గ్రామాల్లో మచ్చుకైనా వౌళిక సదుపాయాలు లేవని, పన్నులు మాత్రం చుక్కలు చూపించే రీతిలో వసూలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసిపి విజయం సాధించడం ఖాయమని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు ధీమా వ్యక్తంచేశారు. విలేఖర్ల సమావేశంలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య, ఎవిఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగునికి మూడు చక్రాల సైకిల్
సత్తెనపల్లి, సెప్టెంబర్ 16: డాక్టర్ కోడెల సత్యనారాయణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ కోడెల శివరామ్ దివ్యాంగునికి మూడు చక్రాల సైకిల్‌ను పింపిణీ చేశారు. మండల పరిధిలోని కొత్తగండ్లూరు గ్రామంలో గద్దే ప్రభాకరరావు అనే దివ్యాంగునికి ఈ సైకిల్‌ను ఉచితంగా శుక్రవారం శివరామ్ అందజేశారు. ప్రభుత్వపరంగా సాంకేతిక ఇబ్బందులువుండే అర్హులైనా ఫెన్షన్ రానివారికి పెన్షన్‌లను అందిస్తామని, నిరోద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని, ఆర్హులైన దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల సైకిళ్ళను అందజేస్తామని శివరామ్ అన్నారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలసి గ్రామంలో పర్యటించి గ్రామస్తులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ ఆళ్ళ సాంబయ్య, ఎంపిపి బొర్రా కోటేశ్వరరావు, అబ్బూరి సర్పంచ్ కట్టా రమేష్, తదితరులు పాల్గొన్నారు.

బొగ్గరం సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో చోరీ
ఈపూరు, సెప్టెంబర్ 16: మండలంలోని బొగ్గవరం ఆలయంలో చోరీ జరిగింది. గ్రామంలోని ఊరుబయట ఉన్న సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. శుక్రవారం ఉదయం ఆలయ పూజారి జవహర్‌లాల్ ఆలయంలోకి వెళ్లడానికి ప్రహరీగోడ గేటుకు ఉన్న తాళం తీసేందుకు ప్రయత్నించగా ఆలయంలో లోపలిగా ఉన్న గేటుకు గటిపెట్టి ఉంది.
అంతేకాకుండా తాళాలు పగలకొట్టి ఉన్నాయి. దాంతో పూజారి ఆలయ ధర్మకర్త కాకుమాను రామారావు, గ్రామస్థులకు విషయాన్ని తెలియజేశారు. అందరూ వచ్చి గుడిలోకి వెళ్లిచూడగా రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహాలు, వెండి కిరీటం, మంగళ సూత్రాలు స్వామివారి వెండి కళ్లు అపహరణకు గురైనట్లు గుర్తించారు. ఆలయ నిర్వాహకులు ఈపూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా వినుకొండ రూరల్ సిఐ పివి శ్రీనివాసరావు, ఎస్‌ఐ ఉజ్వలకుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. గుంటూరు నుండి క్లూస్ టీం సిఐ కె శ్రీనివాసరావు వేలిముద్రలు సేకరించా రు. పూజారి, ఆలయ ధర్మకర్తల ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపా రు. అపహరణకు గురైన ఉత్సవ విగ్రహాలు, వెండి కిరీటం విలువ సుమారు 2 లక్షల వరకు ఉండవచ్చని వారు తెలిపారు. గుడి పరిసరాల్లో పనిచేసే వారిని పోలీసులు విచారించగా గతంలో కూడా ఉత్సవ విగ్రహాలు చోరీకి గురయ్యాయని, అయితే కొద్దికాలానికి అవి అద్దంకి బ్రాంచ్ కెనాల్‌లో బయటపడినట్లు వారు తెలిపారు.