గుంటూరు

చంద్రబాబు హోదా దీక్షకు మద్దతుగా కోడెల సంఘీభావ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, ఏప్రిల్ 19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టనున్న దీక్షకు మద్దతుగా, సంఘీభావంగా స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గురువారం నరసరావుపేటలోని కోట నుండి కోటప్పకొండకు సైకిల్ యాత్ర చేశారు. ఉదయం తొమ్మిది గంటలకు ఆయన క్యాంప్ కార్యాలయమైన కోట నుండి ఈ సైకిల్ యాత్ర ప్రారంభం కాగా మండల పరిధిలోని యల్లమంద గ్రామ శివారులో సైకిల్‌పై నుండి కోడెల ఒక్కసారిగా కింద పడిపోవడం అందరినీ ఆందోళనకు గు రిచేసింది. జ్వరంతో నీరసంగా ఉన్నా యాత్రలో పాల్గొన్న డాక్టర్ కోడెలకు ఈ సంఘటలో తలకు, చేతులు, కాళ్లకు రక్తగాయాలయ్యాయ. కార్యకర్తలు, పక్కనే ఉన్న ఆయన తనయుడు కోడెల శివరామ్ ఆయనకు వైద్యసేవలు అందించారు. అయనా మొక్కవోని దీక్షతో సైకిల్ యాత్ర కొనసాగించిన కోడెల కోటప్పకొండకు 12.15 నిమిషాలకు చేరుకున్నారు. కోట నుండి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర సత్తెనపల్లి రోడ్డులోని వినాయకుని గుడి మీదుగా బైపాస్ రోడ్డు నుండి పల్నాడ్ బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం, శివుని బొమ్మ సెంటర్, మల్లమ్మ సెంటర్ మీదుగా ఓవర్ బ్రిడ్జి నుండి వినుకొండ రోడ్డు మీదుగా కోటప్పకొండ రోడ్డుకు చేరుకున్నారు. స్పీకర్ సైకిల్ యాత్రలో మహిళలు అడుగడుగునా హారతులు ఇచ్చారు. తిలకం దిద్దారు. గుమ్మడి కాయలతో దిష్టి తీశారు. దారి పొడవునా టన్నుల కొద్ది బంతిపూల వర్షం కురిపించారు. స్పీకర్ కోడెలతో పాటు ఆయన కుమారుడు కోడెల శివరాం కూడా ఈ సైకిల్ యాత్రలో పాల్గొన్నారు. వీరి వెంట భారీగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు. వందలాది సైకిళ్ళు, వందలాటి మోటారు సైకిళ్ళు, ఆటోలు, కార్లు వీరి వెంట కొనసాగాయి. బాణసంచాతో ఈ ర్యాలీ ముందుకు సాగింది. కోటప్పకొండ రోడ్డు నుండి యల్లమంద, గురవాయపాలెం, చినతురకపాలెం మీదుగా కొండకు చేరుకున్నారు. మార్గమధ్యంలోని గ్రామాల ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని స్పీకర్ కోడెలకు, ఆయన కుమారుడు డాక్టర్ కోడెల శివరాంకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. స్పీకర్ చుట్టూ రోప్ పార్టీ ఉండగా, డిఎస్పీ నాగేశ్వరరావు పర్యవేక్షణలో పెద్ద ఎత్తున పోలీసులు ఈ సైకిల్ యాత్రలో పాల్గొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు సైకిల్ యాత్ర 12.15 గంటలకు కోటప్పకొండ మెట్ల మార్గంలోని విఘ్నేశ్వరస్వామి దేవాలయం వరకు చేరుకున్న అనంతరం ముగిసింది. సైకిల్ యాత్ర ప్రారంభానికి ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు వేల్పుల సింహాద్రియాదవ్, కడియాల రమేష్, వేములపల్లి నర్సయ్య, కొక్కిరాల శ్రీనివాసరావు, శ్రీనివాసరావు, పోతుల శంకర్, కడియం కోటి సుబ్బారావు, కొల్లి ఆంజనేయులు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్య తదితరులు ఆయనకు సంఘీభావం తెలిపారు.