గుంటూరు

రాజధానిలో ఉద్యానవన పార్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 20: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించే రాజధాని అమరావతిలో శాఖమూరు వద్ద ప్రపంచ స్థాయిలో పర్యాటక కేంద్రం రూపుదిద్దుకోనుంది. పర్యాటకశాఖ విధానాలను అనుసరించి శాఖమూరులో 300 ఎకరాల విస్తీర్ణంలో సెంట్రల్‌పార్కును ఎడిసి నిర్మిస్తోంది. ఇందులో భాగంగా సుమారు 20 ఎకరాల్లో వెల్డర్‌నెస్ పార్కును ప్రగతి గ్రూపు సంస్థ పిపిపి పద్ధతిలో నిర్మించనుంది. ఇందుకు అవసరమైన అనుమతిపత్రాలను శుక్రవారం ఎడిసి సీఎండి డి లక్ష్మీపార్థసారథి సంస్థ ప్రతినిధులకు అందజేశారు. ఆద్యంతం పచ్చదనంతో నిండి ఉండే ఈ పార్కును సకాలంలో పూర్తిచేయాలని సీఎండి సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. నక్షత్ర, రాశి, నవగ్రహ వనాలను, ఉడెన్ కాటేజీలను అత్యున్నత ప్రమాణాలతో రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎడిసి పట్టణ ప్రణాళికావిభాగాధిపతి పి సురేష్‌బాబు, ప్రణాళికా విభాగం సలహాదారు పి తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు దీక్షకు మద్దతుగా దీక్ష
మంగళగిరి, ఏప్రిల్ 20: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన జన్మదినం రోజున శుక్రవారం జరిపిన ధర్మపోరాట దీక్షకు మద్దతుగా మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం అధికారులు, ప్రజాప్రతినిధులు దీక్ష జరిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కమిషనర్ ఎన్‌వి నాగేశ్వరరావు, డీఈఈ పి ఏడుకొండలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది దీక్ష జరిపారు. మండల పరిధిలోని ఎర్రబాలెం గ్రామంలో జడ్‌పీటీసీ మెంబర్ ఆకుల జయసత్య, తహశీల్దార్ వసంతబాబు, సిఆర్‌డీఎ డిప్యూటీ కలెక్టర్ లలిత, మండల టీడీపీ అధ్యక్షుడు చావలి ఉల్లయ్య, మండల సహాయ గణాంక అధికారి డీ బాలనాగేశ్వరరావు, ఆకుల ఉమామహేశ్వరరావు తదితరులు నల్లబాడ్జీలు ధరించి ర్యాలీ జరిపారు. అనంతరం చంద్రబాబు దీక్షకు సంఘీభావంగా దీక్షలో పాల్గొన్నారు. నీరుకొండ గ్రామంలో చంద్రబాబు దీక్షకు సంఘీభావంగా టీడీపీ నాయకులు నన్నపనేని నాగేశ్వరరావు, ముప్పాళ్ల అనిల్, మాదల సునీల్, వెంకటేశ్వరరావు, శశిధర్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు.