గుంటూరు

కేంద్రానికి తెలుగువారి సత్తా చాటేందుకే ధర్మపోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నూరు, ఏప్రిల్ 20: ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు సంఘీభావంగా పొన్నూరులో తెలుగు తమ్ముళ్లు శుక్రవారం దీక్ష జరిపారు. దీక్షాపరులకు వేద పండితులు, ముస్లిం వౌజన్లు, చర్చిల పాస్టర్లు ఆశీర్వచనాలు అందజేశారు. విద్యాసంస్థల నిర్వాహకులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు పలు సంస్థల నిర్వాహకులు కూడా తరలివచ్చి దీక్షలకు సంఘీభావం తెలిపారు. విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలు, ఇచ్చిన హామీలు అమలు చేయాలని దీక్ష కొనసాగించిన నేతలు ముక్తకంఠంతో నినదించారు. దీక్షకు కొనసాగించిన పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్రకుమార్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా అమలు విషయమై అలక్ష్యం చేస్తే తెలుగుజాతి ఉపేక్షించదన్నారు. దీక్షా శిబిరంలో ఎమ్మెల్యేతో పాటు డిసిఎంఎస్ చైర్మన్ ఇక్కుర్తి సాంబశివరావు, యార్డు చైర్మన్ నన్నపనేని ప్రభాకరరావు, వైస్ చైర్మన్ బాబురావు, మాజీ చైర్మన్ మాదల వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్ సజ్జా హేమలత, వైస్ చైర్మన్ ఆకుల సాంబశివరావు, కౌన్సిలర్లు, పట్టణ, మండల తెలుగుదేశం నేతలు పిఎ ఖాన్, బొర్రు రామారావు, చే బ్రోలు ఎంపీపీ ఖాదర్‌బాషా, పార్టీ నేత కోటేశ్వరరావు, సీపీఐ నాయకులు రామారావు, పరశురామయ్య పాల్గొన్నారు.
సంఘీభావ దీక్ష
గుంటూరు (కొత్తపేట)/తాడికొండ : ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సెంట్రల్ టీచర్స్ అసోసియేషన్, నాన్ టీచింగ్ ఎంప్లారుూస్ యూనియన్ సంయ్తుంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా సంఘీభావాన్ని తెలియ జేశారు. విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్రం మన రాష్ట్రం పట్ల అనుచరిస్తున్న నిరక్ష్య వైఖరికి నిరసనగా నినాదాలు చేస్తూ విశ్వవిద్యా లయం ప్రాగణమంతా నిరసన ప్రదర్శన నిర్వహంచారు. బోధనా సిబ్బంది ప్రధాన కార్యదర్శి రామచంద్రరావు మాట్లాడుతూ విభజన చట్టంలోని హమీలంనన్నింటిని అమలు చేసేవరకు ఉద్యమాన్ని చేస్తామని, వవ్యాంద్ర నిర్యాణానికి అహర్శిశలు పాటుపడుతున్న ముఖ్యమంత్రికి అండగా ఉంటామని, కేంద్రం దిగివచ్చేవరకూ పోరాడతామ ని తెలియ జేశారు. ఈకార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ అమ్మిరెడ్డి, రిజిస్ట్రార్ డి. భాస్కరరావు, విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

దర్మ పోరాట దీక్షకు ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు
* బస్సుల్లో వెళ్ళిన టీడీపీ నాయకులు
తెనాలి, ఏప్రిల్ 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయక పోవడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన దీక్షకు మద్దతుగా శుక్రవారం తెనాలిలోని వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వాధికారులు మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షలో పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ దీక్షలో ఆర్డీఓ జి నరింహులు, మున్సిపల్ కమిషనర్ కె శకుంతల, విద్యుత్ డిఇ మురళీకృష్ణ, ఎన్‌జిఓ అసోసియేషన్ అధ్యక్షుడు మనె్న మల్లికార్జునరావు, కోశాధికారి అర్జునరావు, జాతీయ అవార్డు గ్రహీత వేజెళ్ళ ఉమామహేశ్వరరావు, జెడ్పీటిసి అన్నాబత్తుని జయలక్ష్మి, శ్రీ్ధర్, జిల్లా వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ అబ్బయ్య, ఎస్ రామారావు, హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్, డాక్టర్ ఆరెమండ సాంబశివరావు, ఎంపిహెచ్ డాక్టర్ బివి రమణ, మున్సిపల్ ఆర్‌ఓ యోగేంద్రనాధ్, మధుబాబు, సిటిఓ పెరుమాళ్ళ మురళీకృష్ణ, వాహన తనిఖీ అధికారి ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. స్థానిక బోస్ రోడ్‌లోని టీడీపీ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన ధర్మ పోరాట దీక్ష విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా తెనాలి నుండి 58 బస్సులతో ఊరేగింపుగా నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్ళారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు జెండా ఊపి ప్రారంభించారు. యార్డు చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు, పట్టణ టిడిపి అధ్యక్షుడు ఖుద్దూస్, మున్సిపల్ వైస్‌చైర్మన్ నియాజుద్దీన్, మంగమూరి హరిబాబు, కౌన్సిలర్లు గుమ్మడి రమేష్, మొఘల్ అహ్మద్, ఇంజనీర్ సత్యనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డిపాటి రాంబాబు ఆద్వర్యంలో సభ్యులు కోట రమేష్, సభ్యులు శుక్రవారం కోర్టు విధులను బహిష్కరించి సంఘీభావం తెలిపారు.