క్రైమ్/లీగల్

బంధువుల రోదనలతో దద్ధరిల్లిన ఆసుపత్రి ఆవరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురజాల, మే 14: పిడుగుపాటుకు గురై ముగ్గురు విద్యార్థులు మృత్యువాతకు గురికావడంతో తల్లి దండ్రులు, బంధువుల రోదనలు ఆసుపత్రి ప్రాంగణంలో దద్ధరిల్లింది. మండలంలోన గొట్టెముక్కల శివారుగ్రామమైన సమాధానంపేటలో క్రికెట్ ఆడుతుండగా పిడుగుపడి పదో తరగతి చదువుతున్న మూఢావత్ పవన్ నాయక్ (15), ఏడో తరగతి చదువుతున్న భోజావత్ శ్రీహరినాయక్ (12), నాలుగో తరగతి చదువుతున్న మేరాజోత్ మనోహర్ నాయక్ (10) మృతి చెందగా, ఏడో తరగతి విద్యార్థి భోజావత్ హరిబాబునాయక్ తీవ్ర గాయాలపాలు కావడంతో ఒక్కసారిగి సమాధానంపేటలో విషాదచ్ఛాయలు అలముకున్నాయి. మృతదేహాలను పోస్టు మార్టం నిర్వహించేందుకు గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తెచ్చారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఒకేసారి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. కన్నీరు మున్నీరుగా రోదిస్తున్న తీరు అందరినీ కంట తడిపెట్టించింది. పదో తరగతి పరీక్షల్లో 9.7జీపీఏ సాధించిన తన కుమారుడు పవన్‌నాయక్ తమను వదిలి వెళ్ళిపోయాడంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించడంతో చూపరుల హృదయాలు కలిచివేశాయి. మృతదేహాలను ఆర్డీవో మురళీ, తహశీల్దార్ వెంకట్, అర్భన్ సిఐ రామారావు పరిశీలించి, సంఘటనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. మాచర్ల మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ యాగంటి మల్లిఖార్జునరావు మృతదేహాలను సందర్శించి, బంధువులను పరామర్శించారు. వైయస్సార్‌సీపీ ఇన్‌చార్జి కాసు మహేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ఫోన్ ద్వారా బంధువులను పరామర్శించారు. సంఘటనా వివరాలను ఉన్నతాధికారులకు నివేదిక పంపించనున్నట్లు ఆర్డీవో మురళీ తెలిపారు. అనంతరం ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు.

రూ. 8.70 లక్షల విలువైన గుట్కా స్వాధీనం
పిడుగురాళ్ల, మే 14: పట్టణంలో పలుచోట్ల దాడులు చేసి సుమారు 8.70 లక్షల రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సత్తెనపల్లి డిఎస్‌పి కాలేషావలి తెలిపారు. సోమవారం పట్టణంలోని పోలీసుస్టేషన్‌లో అరెస్ట్ చేసిన నిందితులతో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేషావలి మాట్లాడుతూ బెంగళూరు, హైదరాబాద్ తదితర ఏరియాల్లో హోల్‌సేల్‌గా గుట్కా ప్యాకెట్లను కొనుగోలు చేసి పట్టణంలోని బడ్డీకొట్లకు, షాపులకు విక్రయిస్తున్న దాచేపల్లి రమేష్, ఆతుకూరి గురుప్రసాద్, ఆతుకూరి హనుమంతరావు, నాళం కిషోర్‌లను పక్కా సమాచారంతో వారిపై నిఘా ఉంచి పిడుగురాళ్ల పట్టణ సిఐ హనుమంతరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు హరిబాబు, మహ్మద్ రఫి దాడులు చేసి సుమారు 8.50 లక్షల విలువైన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పట్టణంలోని పలు బడ్డీకొట్టు, షాపుల్లో విక్రయిస్తున్న 20 వేల రూపాయల విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, 12 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. హోల్‌సేల్‌గా గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్న నిందితులపై గతంలో కూడా కేసులు నమోదయ్యాయని, వారి బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి గుట్కాలు అమ్మి అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బంది దరియ, శ్రీనివాసనాయక్, హనుమంతరావు, గోపాల్, గురునాథరెడ్డి, చందు, మూర్తి, ఆంజనేయులులను డిఎస్‌పి అభినందించారు. వీరికి రివార్డుల కోసం సిఫారసు చేస్తామన్నారు.