క్రైమ్/లీగల్

సమాధి నుండి మైనర్ బాలుడి శవం వెలికితీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నూరు, జూన్ 25: మండల పరిధిలోని పచ్చలతాడిపర్రు గ్రామ శ్మశానవాటికలో సమాధి చేసిన మైనర్ బాలుడు డక్కుమళ్ల కిరణ్‌బాబు మృతదేహాన్ని సోమవారం అధికారులు బయటకు తీయించి, శ్యాంపిల్స్ సేకరించి పరీక్ష నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. వివరాల్లోకి వెళితే... పొన్నూరు పట్టణానికి చెందిన రత్నం, మేరి విజయకుమారి దంపతుల సంతానమైన డక్కుమళ్ల కిరణ్‌బాబు (17)కు మతిస్థిమితం తక్కువ. పట్టణంలోని ఇందిరాకాలనీలో 10 శెంట్ల ఇంటి స్థలం, పిటి పర్రులో నాలుగైదు ప్లాట్లు వెరశి ఐదు లక్షల ఆస్తి ఆ బాలుడికి తల్లిదండ్రులు మృతిచెందడంతో సంక్రమించింది. మతిస్థిమితం లేని అతని ఆస్తిని కాజేసేందుకు బంధువులు అతనికి ఏదో మందును తాగించగా ఆ బాలుడు పొన్నూరులో ఈ ఏడాది జనవరి 7వ తేదీన మృతిచెందాడు. పచ్చలతాడిపర్రుకు చెందిన అతని బంధువులైన లూథర్, మనెమ్మ, వారి కుమారుడు దానియేలు అతని మృతదేహాన్ని పచ్చలతాడిపర్రులో ఖననం చేశారు. తన అక్కకుమారుడు కిరణ్‌బాబు మృతిచెందిన సమాచారం తెలుసుకున్న చిన్నమ్మ గంటా నిర్మల ఏలూరు ప్రాంతం నుంచి హుటాహుటిన పొన్నూరుకు చేరుకుని విచారించింది. తన అక్కకుమారుడిని హతమార్చి ఉంటారన్న అనుమానంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేయకుండా ప్రేక్షకపాత్ర వహించారు. సిఐకి, డిఎస్‌పికి ఫిర్యాదు చేసినా వారు కూడా కేసు నమోదు చేయలేదు. దీంతో ఆగ్రహించిన నిర్మల న్యాయం చేయాలని పొన్నూరు అడిషనల్ జూనియర్ సివిల్ కోర్టులో 2018 మే 21న కేసువేయగా న్యాయవాది డి కోటేశ్వరరావు (డికె) చేసిన వాదన మేరకు కోర్టు విచారణ జరిపి 2018 మే 25న పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సమాధి నుంచి మృతదేహాన్ని వెలికితీసి, శ్యాంపిల్స్ తీసి పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపాలని ఆదేశించారు. దీంతో సోమవారం పోలీసులు, ప్రభుత్వ వైద్యులు, పిటిపర్రుకు వెళ్లి సమాధి నుండి కిరణ్‌బాబు మృతదేహాన్ని వెలికితీశారు. కాగా శవం నుంచి శ్యాంపిల్స్ సేకరిస్తున్న సమయంలో కొందరు మద్యం సేవించిన వ్యక్తులు శ్మశానం వద్ద గలభా సృష్టించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.