క్రైమ్/లీగల్

9 కలప షాపులు దగ్ధం ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలకలూరిపేట, ఆగస్టు 7: చిలకలూరిపేట పట్టణంలోని ఓల్డ్‌బ్యారెన్ నగర్‌లో ఉన్న కలప షాపులు మంగళవారం దగ్ధమయ్యాయి. చిలకలూరిపేట పట్టణ సిఐ సురేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం... ఓల్డ్‌బ్యారెన్ నగర్‌లోని కలప షాపుల్లో ఒక్కసారిగా మంటలు వచ్చాయని, రోడ్డుపై ఉన్న కలప దుంగలకు, షెడ్లకు మంటలు వ్యాప్తిచెందాయి. సమీప ప్రాంతంలో ఎవరూ లేకపోయే సరికి పక్కనున్న షాపులకు మంటలు వ్యాపించాయి. మంటలు ఎగిసిపడుతున్న సమయంలో అటువైపు వెళ్తున్న మహిళలు చూసి పెద్దగా కేకలు వేశారు. చుట్టుపక్కల వారు వచ్చి చిలకలూరిపేట పోలీసులు, అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం అందించారు. స్పందించిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ఎంత ప్రయత్నించినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వైపు మంటలు వ్యాప్తి చెందకుండా సిబ్బంది, యువకులు కృషి చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దుకాణాలను పరిశీలించి ఒక్కో షాపుకు 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత మర్రి రాజశేఖర్ బాధితులను పరామర్శించి ప్రభుత్వం బాధితులను తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం రాధాకృష్ణ, జనసేన నాయకులు రవితేజ, బాషా, బ్రహ్మస్వాములు తదితరులు బాధితులను పరామర్శించారు.