క్రైమ్/లీగల్

ప్రయాణికులను మోసం చేస్తున్న ముఠా గుట్టురట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (అరండల్‌పేట) సెప్టెంబర్ 4: ప్రయాణికులను మోసం చేస్తూ వారి వద్ద నుంచి నగదును దొంగలిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు సిసియస్ పోలీసులు. మంగళవారం సిసియస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ మేరకు నిందితుల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలోని బస్టాండ్, మార్కెట్ కూడళ్లలో ప్రయాణికుల నుంచి ఎక్కువగా నగదు దోచుకుంటున్నారన్న సమాచారంతో అర్బన్ ఎస్పీ విజయరావుప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే అంకమ్మనగర్ 7వ లైనుకు చెందిన బడుగు శ్యాంసన్, దాసరిపాలెం ప్లాట్‌లకు చెందిన పటాస్ అహ్మద్ ఖాన్, కోనేరు బజార్‌కు చెందిన షేక్ నాగుర్‌బీ ఆటోలో ప్రయాణిస్తున్న వారిని మోసగించి వారి వద్ద నుంచి డబ్బులు దోచుకుంటున్నారని తేలింది. ఈ క్రమంలో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారు నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. నిందితులపై గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వారు ఆటోలో ప్రయాణించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. నిందితులను పట్టుకోవడంలోప్రతిభ చూపిన సుబ్రహ్మణ్యం, సురేష్ బాబు, ఎఎస్సై కోటేశ్వరరావు, సాయి, సాంబశివరావు, అనీల్ కుమార్, వీరాంజనేయులు, శ్రీనివాసరావు, సుబ్బారెడ్డి, కొత్తపేట ఎఎస్సై ఆంటోనీలకు రివార్డ్‌లను అందించారు.

తెలుగుయువత నేతకు తృటిలో తప్పిన ప్రమాదం
చేబ్రోలు, సెప్టెంబర్ 4: మండల పరిధిలోని వడ్లమూడి గ్రామానికి చెందిన జిల్లా తెలుగు యువత నాయకులు, ఎమ్మెల్యే అనుచరుడు షేక్ బాజికి మంగళవారం తృటిలో ప్రమాదం తప్పి సురక్షితంగా బయటపడ్డారు. కొమ్మమూరు ఛానల్‌లో సోమవారం గల్లంతైన యువకుని విషయంపై షేక్ బాజి మంగళవారం కొమ్మమూరు ఛానల్ వద్ద అధికారులతో మాట్లాడి బుల్లెట్‌పై వస్తుండగా ప్రమాదవశాత్తు బుల్లెట్‌తో పాటు బాజీ కూడా కాల్వలో పడ్డాడు. వెంటనే అక్కడున్న ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం బాజీని సురక్షితంగా కాపాడారు. మునిగిపోయిన బుల్లెట్‌ను కూడా బయటకు తీశారు. విషయం తెలుసుకున్న పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్రకుమార్ ఫోన్‌లో పరామర్శించారు. సురక్షితంగా బయటపడిన బాజీ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఇంకా దొరకని యువకుని ఆచూకీ
మండల పరిధిలోని వడ్లమూడి గ్రామంలో సోమవారం కొమ్మమూరు ఛానల్‌లో గల్లంతైన యువకుడు కిరణ్ ఆచూకీ మంగళవారానికి కూడా లభించలేదు. రెవెన్యూ, పోలీసు, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు గల్లంతైన యువకుని ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. అయినప్పటికీ ఈచూకీ దొరకలేదు.