క్రైమ్/లీగల్

యువతి ఆత్మహత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి: యువతి ఆత్మహత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్చుచెప్పారని తెలుసుకున్న గ్రామంలోని ఇరువర్గాలు ఒకరిపైఒకరు దాడులు చేసుకొని తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన సంఘటన గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం కొత్తపాలెం గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కొత్తపాలెం గ్రామానికి చెందిన యువతిపై 2015లో కొందరు యువకులు మూకుమ్మడిగా అత్యాచారంచేసి హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఈసంఘటనపై మృతురాలి తల్లిదండ్రులు తమ కుమార్తెను హత్యచేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదుచేసి విచారణ చేపట్టిన పోలీసులు ఆరుగురు యువకులను అరెస్టుచేసి రేపల్లె కోర్టులో ప్రవేశపెట్టారు. ఈకేసు విచారణలో ఏ-1 ముద్దాయి తిప్పల నాగరాజుకు న్యాయమూర్తి జీవిత ఖైదు విధిస్తూ బుధవారం తీర్పువెలువరించారు. ఇదేరోజు కొత్తపాలెం గ్రామంలో జరుగుతున్న ఓ శుభకార్యానికి హాజరైన హతురాలి బంధువులు, నాగరాజు వర్గాలవారు తీర్పుపై చర్చించుకుంటూ వాగ్వివాదాలకు దిగి తుదకు రాడ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. ఈఆకశ్మిక దాడుల నేపథ్యంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో రేపల్లె సీఐ ఏఎస్ ఆంజనేయులు తన సిబ్బందితో హుటాహుటిన గ్రామానికి చేరుకొని క్షతగ్రాతులైన 8మందిని రేపల్లెకు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యసేవల కోసం గుంటూరుకు తరలించారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటుచేసినట్లు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే ఇరువర్గాల మధ్య ఈదాడులు జరిగినట్లు పోలీసులు ప్రాథమిక విచారణకు వచ్చారు. క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు.