గుంటూరు

గిరిజనుల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), సెప్టెంబర్ 20: గిరిజనుల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర సభ్యుడు కొండారెడ్డి నరహరి ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా గురువారం గుంటూరు విచ్చేసిన ఆయన పలు గిరిజన కాలనీల్లో పర్యటించి సమస్యలను అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా నరహరి మాట్లాడుతూ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ గిరిజనులు నివశించే ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు వౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఆయన చేసిన కృషి ఫలితంగానే రాష్ట్రానికి జాతీయ స్థాయిలో అవార్డు కూడా లభించిందన్నారు. అటవీ ప్రాంతాల్లో నివశించే గిరిజనులతో పాటు మైదాన ప్రాంత గిరిజనుల అభివృద్ధికి కూడా పలు పథకాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. ఏజన్సీ ప్రాంతాల్లో ఐటిడిఎ ద్వారా అభివృద్ధి చేసి రెండు ఎకరాల కాఫీ తోటలను గిరిజనులకు ఇచ్చి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తుందన్నారు. యువనేస్తం పథకం ద్వారా గిరిజన నిరుద్యోగ యువతకు నెలకు 1000 రూపాయలు పెన్షన్‌గా అందజేస్తున్నారన్నారు. 50 సంవత్సరాలు దాటిన గిరిజనులకు 1000 రూపాయల పెన్షన్‌ను కూడా ప్రభుత్వం అందజేస్తుందన్నారు. రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకునేందుకు ఎన్డీయే ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమన్నారు. ఆయన వెంట గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోకల రామకృష్ణ, పాలపర్తి అభిషేక్, తోకల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అట్టహాసంగా వైసీపీ జిల్లా నూతన కార్యాలయ ప్రారంభోత్సవం
గుంటూరు, సెప్టెంబర్ 20: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యాలయాన్ని ఆ పార్టీ సలహాదారు, సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త కిలారి రోశయ్య అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే జగన్ ప్రజా సంకల్పయాత్రను చేపట్టారని 267 రోజుల్లో 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారన్నారు. అన్నివర్గాల ప్రజలకు సుపరిపాలన అందాలంటే జననేత జగన్‌కే సాధ్యమన్నారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో పార్టీ ఓడిపోయినా ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యతనిస్తోందన్నారు. శాసనమండలి విపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నిరంగాలను చంద్రబాబు నిర్వీర్యం చేశారన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి తమ ఎమ్మెల్యేలకు కూడా పదవులు ఇచ్చి ఉమ్మడి ప్రభుత్వానికి చంద్రబాబు సారధ్యం వహిస్తున్నారన్నారు. ప్రజలు ఎన్నుకున్న గ్రామ సర్పంచ్‌లకు కాకుండా తమ పార్టీ కార్యకర్తలను జన్మభూమి కమిటీ సభ్యులుగా నియమించి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గుంటూరు, నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తలు కిలారి రోశయ్య, లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ టీడీపీ వైఫల్యాలను కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలన్నారు. ఎన్నికలు జనవరిలో గానీ మే నెలలో గానీ జరగవచ్చన్నారు. ఇప్పటి నుండే కార్యకర్తలు కార్యోన్ముకులై విజయానికి సైనికుల్లా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ధర్మానికి, అధర్మానికి జరిగే పోరాటంలో టీడీపీ ఓటమి ఖాయమన్నారు. కార్యకర్తలే కాకుండా నాయకులు కూడా త్యాగాలకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్త్ఫా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నాయకులు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, విడదల రజని, బొల్లా బ్రహ్మనాయుడు, అన్నాబత్తుని శివకుమార్, జంగా కృష్ణమూర్తి, నందిగం సురేష్, నిమ్మకాయల రాజనారాయణ, నసీర్ అహ్మద్, గులాం రసూల్ తదితరులు పాల్గొన్నారు.

అథ్లెటిక్స్‌లో రాణించిన సిమ్స్ మై స్కూల్
గుంటూరు (స్పోర్ట్స్), సెప్టెంబర్ 20: అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో స్థానిక ఎన్‌టిఆర్ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో గురువారం జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో సిమ్స్ మై స్కూల్ జట్టు ఓవరాల్ ఛాంపియన్ షిప్‌ను కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో రన్నర్స్ టైటిల్‌ను నర్సరావుపేటకు చెందిన కేర్ స్కూల్, శ్రీ పూజిత స్కూల్స్ సాధించాయి. అనంతరం జరిగిన బహుమతి కార్యక్రమానికి అథ్లెటిక్స్ సంఘ కార్యదర్శి జి శేషయ్య ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతలైన జట్లకు ఛాంపియన్ షిప్ ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 150 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారన్నారు. ఇటువంటి పోటీల్లో పాల్గొనడం ద్వారా బాలబాలికల్లో ఉన్నటువంటి ప్రతిభ, నైపుణ్యాలను వెలికి తీసేందుకు దోహద పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు శివారెడ్డి, ఎం అశోక్, ఆర్ హనుమాన్, నాయక్, అథ్లెటిక్స్ సంఘ టెక్నికల్ అఫిషియల్ జివిఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.