గుంటూరు

గ్యాస్, మందులు పంపిణీలో అక్రమాలపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 20: రాష్టవ్య్రాప్తంగా గ్యాస్, జనరిక్ మందుల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టంచేశారు. తక్షణమే అక్రమాలను అరికట్టేందుకు సంబంధికులపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. గురువారం గుంటూరులో రాష్టస్థ్రాయి విజిలెన్స్ కమిటీ సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పుల్లారావు మాట్లాడుతూ జనరిక్ మందుల పంపిణీలో అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్యాస్ సిలిండర్‌లు చేరవేసే సిబ్బంది వినియోగదారుల వద్ద అదనంగా డబ్బులు వసూలు చేయకుండా కట్టడి చేస్తామన్నారు. ఇందుకు డీలర్లే సిబ్బందికి జీతాలు ఇవ్వడంతో పాటు పిఎఫ్, ఇఎస్‌ఐ సౌకర్యాలు కల్పించేలా ఆదేశాలు జారీచేస్తామని ప్రకటించారు. పౌర సరఫరాల శాఖను మరింత బలోపేతం చేసేందుకు త్వరలోనే సిఎస్‌డిటి పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా రేషన్‌షాపుల ద్వారా బియ్యంతో పాటు రాగులు, సజ్జలు, జొన్నలు వంటి పోషకాహార పదార్ధాలను ప్రజలకు అందజేస్తామని తెలిపారు. తద్వారా ప్రజల ఆహారపు అలవాట్లను మార్చేలా కృషిచేసి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి ప్రత్తిపాటి పేర్కొన్నారు. సమావేశంలో సివిల్ సప్లైస్ కమిషనర్ బి రాజశేఖర్, ఎండి సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.

ట్రా‘ఫకర్’ ఇంకెన్నాళ్లు?
పిడుగురాళ్ల, సెప్టెంబర్ 20: పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభాతో పాటు వాహనాలు కూడా పెరుగుతున్నాయి. అద్దంకి-నార్కెట్‌పల్లి హైవేలో పిడుగురాళ్ల పట్టణం నుండే ఎంత పెద్దవాహనమైనా వెళ్లాలి. జనాభా పెరుగుతుంది, వాహనాలు పెరుగుతున్నాయి, పట్టణంలోని బైపాస్ పనులు మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండటంతో ఏళ్ల తరబడి ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. అమరావతి రాజధాని అయిన తర్వాత హైదరాబాద్ నుండి గుంటూరుకు ఇదే ప్రధాన రహదారి కావడంతో వాహనాలు వేల సంఖ్యలో ప్రయాణిస్తున్నాయి. వాహనాల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ సమస్య మరింత జటిలంగా మారింది. పట్టణంలో చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వారు ఫుట్‌పాత్ దాటి రోడ్డుపైనే ఉండటంతో ట్రాఫిక్ సమస్య భయంకరంగా మారింది. వాహనాల రద్దీకి పాదచారులు కూడా నడవలేని పరిస్థితి ఏర్పడింది. పట్టణంలోని చిరువ్యాపారులు, తోపుడు బండ్ల వారికి మార్కెట్ వంటి ప్రాంతాన్ని కేటాయిస్తామని చెప్పి నేటివరకు ఆచరణలో పెట్టలేదు.
ఏడేళ్లుగా నిర్మాణంలో ఉన్న బైపాస్..
బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టి ఇప్పటికే ఏడేళ్లు పూరె్తైనా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. పనులు పూర్తికాకపోవడంతో వాహనాలన్నీ పట్టణం మీదుగా వెళ్లున్నాయి. భారీ వాహనాలు వచ్చే సమయంలో రెండు కిలోమీటర్ల పొడవున పట్టణం దాటాలంటే రెండు గంటలు పడుతుంది. ఆ సమయంలో వాటి వెనుక ఉండే వాహనాలు ఓవర్‌టెక్ చేసే అవకాశం లేకపోవడంతో వెనుక భారీగా ట్రాఫిక్ పేరుకుపోతోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్ల పక్కన, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించడంతో పాటు బైపాస్ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తిచేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.