గుంటూరు

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ అద్భుత ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, సెప్టెంబర్ 20: దేశంలోనే ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ అద్భుత ప్రతిభ కనబరుస్తోందని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కోటప్పకొండ సంజీవని హాస్పిటల్స్‌లో యోగా, ఆయుర్వేదం, పంచకర్మ థెరపీ క్లాసులను గురువారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో స్కిల్స్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పడిన నాలుగు సంవత్సరాల్లో 39 రంగాల్లో ట్రైనింగ్ ఇస్తామన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా స్కిల్స్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇస్తున్నారని అన్నారు. పదో తరగతి నుండి డిగ్రీ, అంతకు పైగా చదివిన వారికి ట్రైనింగ్ ఇచ్చి వారికి జాబ్ ఆఫర్లు చూపిస్తారని అన్నారు. ఈ సెంటర్‌లో మూడు నెలలు శిక్షణ పొందితే ఉపాధి అవకాశాలతో పాటు సొంతగా మీ కాళ్ళపై మీరు బతికే అవకాశం ఉంటుందన్నారు. 17 సంవత్సరాల నుండి ఉన్న ఈ కాకతీయ సత్రంలో అనేక సేవా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. మూడు నెలల పాటు 30 మంది మగ, ఆడ పిల్లలకు ఇక్కడ శిక్షణ ఇస్తారన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వారికి అవకాశాలు లభిస్తాయన్నారు. కీళ్ళ నొప్పులు, మానసిక ఇబ్బందులకు కోటప్పకొండ సంజీవనిలో చికిత్స చేస్తామన్నారు. ప్రతి మనిషి రోజులో గంటసేపు ఆరోగ్యం కోసం కేటాయిస్తే 23 గంటలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. మందులు లేని వైద్యం అందించడమే ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశమన్నారు. కోటప్పకొండలో సంజీవని ఏర్పాటు చేసిన ఐదు నెలల్లోనే అద్భుతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. నిజాయితీగా పనిచేస్తే ఎంతైనా సాధించవచ్చని ఇక్కడ వైద్యులు నెరవేర్చుకున్నారని తెలిపారు. కేవలం సేవా దృక్పథంతో ఏర్పాటు చేసిన సంజీవని , అతి తక్కువ రుసుంతో వైద్యం అందిస్తోందని తెలిపారు. ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న పదో తరగతి చదివిన వారు 20 వేల రూపాయల వరకు సంపాదించవచ్చన్నారు. మెడిసన్ లేకుండా మన ప్రాచీన పద్ధతులైన యోగ, పంచకర్మ ఇతర వైద్యాల ద్వారా జబ్బులు తగ్గిస్తారన్నారు. రానున్న పది సంవత్సరాల్లో కొటప్పకొండ ప్రాంతం ఎవ్వరూ ఊహించని విధంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ జిల్లా అధికారి అజేష్ చౌదరి, బసవ తారకం హాస్పిటల్ ఏవో సుమతి, ఎంపీపీ ప్రభాకర్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ కడియాల రమేష్, డాక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

* దేశంలో ‘సంగం’దే అగ్రస్థానం
* సర్వసభ్య సమావేశంలో చైర్మన్ నరేంద్రకుమార్
చేబ్రోలు, సెప్టెంబర్ 20: ప్రపంచ వ్యాప్తంగా నేడు డెయిరీ రంగం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోందని, అయినప్పటికీ డెయిరీ రంగంలోని సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని నేడు దేశంలోని అన్ని సహకార డెయిరీలలోకెల్లా సంగం డెయిరీని అగ్రస్థానంలో ఉందని సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు. వడ్లమూడి సంగం డెయిరీలో గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో పాల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు పాల సేకరణ ధర తగ్గించడం జరిగిందని, అయితే ఈ పరిస్థితులను అధిగమించి జిల్లాలో ఈ ఏడాది పాల సేకరణకు ఒకే ధరను ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం జిల్లాల నుంచి 4.5 లక్షల లీటర్లు, చిత్తూరు జిల్లా నుంచి రోజుకు 80 వేల లీటర్ల పాలను సేకరించడం జరిగిందన్నారు. ఈ ఏడాది 15 కోట్ల లీటర్ల పాలను ప్రాసెసింగ్ చేయగా అందులో గుంటూరు జిల్లా నుంచి 7 కోట్ల లీటర్లే వచ్చాయన్నారు. జిల్లాలో పాడిగేదెల సంఖను పెంచే కార్యక్రమంలో భాగంగా గేదెల కొనుగోలు చేసేందుకు ఎస్‌ఐబితో ఒప్పందం కూడా కుదుర్చుకున్నామని తెలిపారు. గేదెల కొనుగోలుకు 8.6 శాతం వడ్డీతో రైతులకు రుణాలు ఇచ్చేందుకు ఎస్‌బిఐ ముందుకు వచ్చిందని తెలిపారు. రోజుకు 2.44 లక్షల లీటర్ల పాలను అమ్మడం జరుగుతుందని, ప్రస్తుతం ఉన్న మిల్క్ కల్చర్డ్ బ్లాక్ సామర్థ్యాన్ని 350 మెట్రిక్ టన్నులకు పెంచేందుకు రంగం సిద్ధమైందన్నారు. ఎన్‌డిడిబి నుంచి సంగం డెయిరీ అభివృద్ధి, ఆధునికీకరణకు అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది వెయ్యి మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేశామన్నారు. ప్రస్తుతం డెయిరీలో 500 మెట్రిక్ టన్నుల బటర్ నిల్వ ఉందని, ధరలు పెరిగాక అమ్ముతామన్నారు. నరసరావుపేట ప్రాంతం నుంచి అన్‌సీజన్‌లో గేదెపాలు తక్కువగాను, ఆవుపాలు ఎక్కువగానూ వస్తున్నాయని, ఆవుపాలు వచ్చే ప్రాంతాల్లో ప్రత్యేక ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటుచేసేందుకు పాలకవర్గం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుతం ఉన్న టర్నోవర్‌ను రానున్న రోజుల్లో 1000 కోట్లకు పెంచడమే లక్ష్యంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది 4,61,33,950 రూపాయల నికర లాభం సంగం డెయిరీకి వచ్చిందని చైర్మన్ నరేంద్రకుమార్ వివరించారు. ఈ సమావేశంలో సంగం డెయిరీ ఎండి కె గోపీనాథ్, సంగం డెయిరీ డైరెక్టర్ నర్రా వెంకట కృష్ణప్రసాద్, డెయిరీ అధికారులు పాల్గొన్నారు. అనంతరం అత్యధికంగా పాలు ఉత్పత్తిచేసిన రైతులను చైర్మన్ సన్మానించారు.