గుంటూరు

కోలాహలంగా గణనాథుల ఊరేగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 22: గణపతి నవరాత్రులు శనివారంతో ముగియనున్న సందర్భంగా అమరావతి, పరిసర ప్రాంతాల నుండి అమరావతిలో నిమజ్జనం చేసేందుకు భారీగా గణనాధులు తరలివచ్చారు. సత్యసాయి సేవాసంస్థల కో ఆర్డినేటర్ కె నారాయణరావు పర్యవేక్షణలో జిల్లాలో సత్యసాయి సేవాసమితి వారు ఏర్పాటుచేసిన 9 వినాయక విగ్రహాలు అమరావతిలోని త్రిశక్తి పీఠానికి చేరుకున్నాయి. త్రిశక్తిపీఠం వద్ద చేకూరి జాజిబాబు పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథులను నిమజ్జనానికి తరలించారు. అలాగే మండల పరిధిలోని నరుకుళ్లపాడు గ్రామం నుంచి కాకతీయ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాన్ని యువకులు మేళతాళాల నడుమ ఊరేగింపుగా అమరావతికి తరలించారు. ఈ కార్యక్రమాలను సుంకర సురేష్, ఎం పూర్ణచంద్రరావు, కొసరాజు గోపాలరావు, చెంచయ్య, యలమంచలి మణి, మంచినేని రత్తయ్య, అంజిబాబు, చంద్రశేఖర్ పర్యవేక్షించారు. అమరావతి వద్ద ధ్యానబుద్ధ ఘాట్‌లో గణనాధులను నిమజ్జనం చేశారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అమరావతి సిఐ కె ప్రభాకర్ బందోబస్తు నిర్వహించారు.

ప్రశ్నించే తత్వమే జీవితంలో ఎదుగుదలకు పునాది
* జస్టిస్ లావు ఉద్బోధ
పెదనందిపాడు, సెప్టెంబర్ 22: ప్రశ్నించే తత్వంతోనే విద్యార్థి జీవితం ఉన్నత స్థాయికి ఎదగడానికి తోడ్పాటునందిస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. తెలిసిన విషయం కంటే తెలియనిది ఎంతో ఉందన్న దృక్పథంతో ఆలోచిస్తూ విజ్ఞానాన్ని సముపార్జించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు శనివారం పెదనందిపాడు ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ సొసైటీ ద్వారా జస్టిస్ లావు 4.50 లక్షల రూపాయల ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధించాలన్న పట్టుదలతో కూడిన శ్రమను ఆశ్రయించినప్పుడే లక్ష్యసాధనకు మార్గం సుగమం అవుతుంనద్నారు. విద్యార్థుల ఆలోచన శక్తిలో నిరంతరం మార్పు వచ్చినప్పుడే సమాజాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ నీతి, నిజాయితీతో పనిచేసే వ్యక్తులను సమాజం ఎల్లవేళలా ఆదరిస్తుందన్నారు. పట్టుదల, దీక్ష, సంకల్పబలంతో జీవిత లక్ష్యాలను సాధించవచ్చన్నారు. దేశ చరిత్రలో ధనవంతులకు ఎక్కడా స్థానం లభించలేదన్న వాస్తవం గుర్తుంచుకోవాలన్నారు. దత్తత సంకల్ప బలంతో జస్టిస్ నాగేశ్వరరావు గ్రామాభివృద్ధికి చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. శాప్ చైర్మన్ పోలినేని అంకమ్మచౌదరి మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను బోధించాలని సూచించారు. నల్లమడ రైతు సంఘం కన్వీనర్ కొల్లా రాజమోహనరావు, పాఠశాల పాలకవర్గ అధ్యక్షుడు డి శేషగిరిరావు, ఎంపీపీ ఎం నాగరాజకుమారి, ఎ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.