గుంటూరు

తిరిగి మోదీనే ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 16: దేశంలోని విపక్షాలన్నీ ఏకమైనా 2019 ఎన్నికల్లో నరేంద్రమోదీయే తిరిగి ప్రధానిపీఠం అధిరోహిస్తారని కేంద్ర హోం శాఖ మంత్రి రాజనాథ్‌సింగ్ స్పష్టంచేశారు. స్థానిక ఇన్నర్ రింగురోడ్డులో ఎస్సీ చైతన్య వేదిక సభ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన రాజనాథ్‌సింగ్ మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని అన్నిరంగాల్లో అగ్రభాగాన నిలిపేందుకు ప్రధాని మోదీ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. రాహుల్‌గాంధీ ప్రధానిపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని విమర్శించారు. దేశ స్వాతంత్య్రానంతరం పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. తెలుగువాడైన మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు భౌతికకాయాన్ని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉంచేందుకు కూడా ఆ పార్టీ నేతలు అంగీకరించకపోవడం తెలుగువారిని అవమానించడం కాదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్డీయేను వీడారే తప్ప మరొకటి కాదన్నారు. అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్‌కు తిరిగి ఊపిరి పోసేందుకు బాబు ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. 2014లో కాంగ్రెస్‌తో విభేదించిన బాబు నేడు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో అర్ధం కావడం లేదన్నారు. పోలవరం నిర్మాణానికి, రాష్ట్భ్రావృద్ధికి, వెనుకబడిన జిల్లాలకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నా మోదీని బాబు విమర్శించడం సరికాదని రాజనాథ్‌సింగ్ హితవుపలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరిట రైతుల నుండి వేలాది ఎకరాలు భూములు తీసుకున్న చంద్రబాబు ఆభూములతో వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగేళ్లలో ఏ ఒక్క భవనాన్ని కూడా నిర్మించలేదని విమర్శించారు. కేంద్రం నిధులిస్తున్నా, ఇవ్వడం లేదంటూ చంద్రబాబు అసత్యప్రచారం చేయడం ఆయనకే చెల్లిందన్నారు. బాబు చేస్తున్నవి ధర్మపోరాట దీక్షలు కావని, అధర్మ దీక్షలంటూ దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అధారిటీని ఏర్పాటుచేసేందుకు బాబు ఆలస్యం చేశారని, కేంద్రం నిర్మాణం చేపట్టాల్సి ఉండగా రాష్ట్రానికే అప్పగించారన్నారు. ప్రపంచ బ్యాంకు నుండి లక్షా 25 వేల కోట్లు అప్పు తెచ్చిన చంద్రబాబు ఏ ప్రాజెక్టులు నిర్మించారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు కాక తిరోగమన దిశలో బాబు నడిపిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని నగరంలో బీజేపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత సభా వేదిక నుండే రాజనాథ్‌సింగ్ మంగళగిరిలో ఏర్పాటు చేయనున్న బీజేపీ రాష్ట్ర కార్యాలయ పనులకు రిమోట్ ద్వారా శంకుస్థాపన చేశారు. అనంతరం రాజనాథ్‌సింగ్‌ను పార్టీ శ్రేణులు గజమాలతో సత్కరించగా, కన్నా లక్ష్మీనారాయణ జ్ఞాపికను బహూకరించారు. ఈ సభలో పార్టీ జాతీయ, రాష్ట్ర నేతలు మురళీధరణ్, జీవీఎల్ నరసింహారావు, వినోద్ శాంకార్, సునీల్‌దేవ్, సత్యకుమార్, ఐవైఆర్ కృష్ణారావు, గోకరాజు గంగరాజు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, విష్ణుకుమార్‌రాజు, ఆకుల సత్యనారాయణ, జమ్ముల శ్యామ్‌కిషోర్, జూపూడి రంగరాజు, వెలగలేటి గంగాధర్, ఇస్కా సునీల్, పాండురంగ విఠల్, యడ్లపాటి రఘునాథబాబు తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయంలో సాంకేతిక యాజమాన్యం పాటించాలి
తెనాలి, అక్టోబర్ 16: ప్రపంచ ఆధునీకరణ జరుగుతున్న క్రమంలో రైతులు వ్యవసాయంలో సాంకేతిక యాజమాన్యం పాటించి అధిక దిగుబడులు సాధించేందుకు కృషి చేయాలని తెనాలి శాసన సభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉద్యానవనం, వ్యవసాయశాఖల సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయంలో సాంకేతిక యంత్రాల ఉపయోగం, ఉద్యాన పంటలలో సమగ్ర యాజమాన్యంపై అవగాహన కార్యక్రమంలో జరిగింది. ముఖ్యఅతిథిగా ఆలపాటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుపక్షపాతిగా నేడు అనేక సంక్షేమ పథకాలు అమలుచేయటం జరుగుతోందన్నారు. రుణమాఫీ మొదలుగా వ్యవసాయ యాంత్రీకరణలో భగంగా రైతురథంపేరుతో వందమంది రైతులకు ట్రాక్టర్లు, దుక్కి దునే్నందుకు, విత్తనాలు చల్లేందుకు, నాట్లు వేసేందుకు, కోత కోసేందుకు, ధాన్యం నూర్పిడి చేసేందుకు, ధాన్యాన్ని ఇంటికి చేర్చేందుకు అవసరమై అన్ని రకాల వ్యవసాయ యంత్రపరికరాలపై సబ్సిడీతో అందజేయటం గర్వకారణంగా ఉందన్నారు. ముఖ్యంగా డెల్టా రైతులకు 90శాతం జీవనాధారమైన వ్యవసాయంను దృష్టిలోఉంచుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గోదావరి జలాలను కృష్ణాకు రప్పించి పట్టిసీమ ద్వారా ఈప్రాంతాన్ని సస్యశ్యామలంచేసి అన్నదాతల హృదయాలలో అపర భగీరధుడుగా నిలిచారని గుర్తుచేశారు. నేడు సంవత్సరానికి రెండు పంటలు పండించగలుగుతున్నామంటే అది పట్టిసీమ పుణ్యమేనని పేర్కొన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలలోని మహిళా రైతులకు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి వారికి అవసరమైన పనిముట్లు సబ్సిడీలపై అందించటం జరుగుతుందన్నారు. రైతులు పండించిన పంటలను నిల్వచేసుకునేందుకు గోదాములు, దాచుకున్న పంటలపై బ్యాంకుల ద్వారా రుణసదుపాయాలు కల్పిస్తున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మేలుచేసిన నాయకులను రైతులు మరువవద్దని సాయంచేసిన నాయకునికి మరోమారు పట్టంకట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురు రైతులకు రైతురథం పథకం కింద ట్రాక్టర్లు, మొక్కజొన్న నూర్పిడి యంత్రాలు, ధాన్యం తూకంవేసే యంత్రాలను పంపిణీ చేశారు. ఉద్యాన, వ్యవసాయశాఖల అధికారులతో పాటుగా యార్డు చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, జెడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మి, ఎంపీపీ తులసీలక్ష్మి, టీడీపీ మండల అధ్యక్షుడు కావూరి చంద్రమోహన్, వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ డైరెక్టర్లు, పలుబ్యాంకుల అధికారులు, తెనాలి పట్టణం, కొల్లిపర, తెనాలి రూరల్ మండలాల రైతులు తదితరులు పాల్గొన్నారు.