గుంటూరు

కాపు గర్జనకు చంద్రబాబే స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నూరు, ఏప్రిల్ 11: కాపుల సంక్షేమానికి ఆరు నెలలోపే వెయ్యి కోట్లు కేటాయిస్తానని 2014 ఎన్నికల వాగ్ధానంతో హోరెత్తించి కాపులకు గాలం వేసి ఓట్లు పొంది.. గెలిచి గద్దెనెక్కిన చంద్రబాబు హామీల అమలును అశ్రద్ధ చేయడంతో ముఖ్యమంత్రిని నిలదీసేందుకే తాను కాపు ఉద్యమాన్ని తీవ్రతరం చేసినట్లు కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టంచేశారు. కాపుజాతిలో ఉద్యమస్ఫూర్తిని పెంచింది చంద్రబాబేనన్నారు. తుని ఉద్యమంతో పాల్గొన్న కాపునాయకులకు కృతజ్ఞతలు చెప్పడానికి సోమవారం ఉదయం ఆయన పొన్నూరుకు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాపునాడు కోశాధికారి కోట శ్రీనివాసరావు నివాసంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చక ఏడాదిగా మిన్నకుండి పోవడంతో తాము ఉద్యమించాల్సి వచ్చిందన్నారు. పేద కాపుల బతుకులు గాడిన పడేసేలా చేసేందుకు కాపులను సంఘటితపర్చి తునిలో ఉద్యమం నిర్వహించామన్నారు. తన ఉద్యమాన్ని అడ్డుకుని నీరుగార్చేందుకు అధికార పార్టీ నేతలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా తాము వెనుకంజ వేయలేదన్నారు. కొందరు కాపునేతలకు ఆశచూపి కాపు ఉద్యమాన్ని నిర్వహించేందుకు సైతం అధికార పార్టీ నేతలు కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు. కాపుల భావితరాల భవిష్యత్తు కోసం తాను ఆరంభించిన ఉద్యమానికి సంఘీభావం తెలిపిన కాపులకు కృతజ్ఞతలు తెలిపారు. హామీల అమలుకు తాను రెండోసారి కూడా ఉద్యమించేందుకు సిద్ధపడ్డానని, సంక్షేమ పథకాల అమలు విషయంలో జన్మభూమి కమిటీల ప్రమేయం వద్దని నిలదీయడంతో ప్రభుత్వంలో కొంతమేరకు స్పందన కనిపించిందన్నారు. కాపులకు న్యాయం చేయాలని మాత్రమే తాను ఉద్యమించానని, మిగిలిన కులస్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాపులలో నిరుపేదలకు చదువుకునే స్తోమతలేక అల్లాడుతున్నారని, వారి భవిష్యత్తు కోసమే ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. అంతేకాక మార్చి నుండి మే వరకు విద్యార్థులకు పరీక్షలు జరిగే సమయంలో వారి చదువులకు ఆటంకం కల్గించకూడదన్న అభిప్రాయంతో రెండోసారి ఉద్యమాన్ని వాయిదా వేశామన్నారు. జూన్ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అవసరమైతే ఉద్యమిస్తామని, అప్పటిలోగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటించి ఉద్యమానికి బాసటగా నిలిచిన కాపులను కలుసుకుని కృతజ్ఞతలు తెలుపుకునేందుకు విజయవాడ నుండి పర్యటన ఆరంభించానన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పొన్నూరుకు విచ్చేసిన ముద్రగడ కాపుగర్జనకు సంఘీభావం తెలిపిన స్థానిక కాపునేతలు కోట శ్రీనివాసరావు, వడ్రాణం ప్రసాదరావు, బండి వెంకటేశ్వర్లు, ఆకుల శివయ్య, జక్కా శ్రీనివాస్, కోట రాంబాబు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన పొన్నూరు ఆంజనేయస్వామిని దర్శించుకుని పూజలు జరిపారు. కసుకర్రుగ్రామంలో వినాయకుడి గుడి శంకుస్థాపన కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు.