రాష్ట్రీయం

గోదావరి తీరాన కార్తీక వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి, డిసెంబర్ 12: కార్తీక మాసం చివరి రోజు కావటంతో మహిళా భక్తులు వదిలిన కార్తీక దీపాలతో గోదావరి కొత్త వెలుగులుతో కళకళలాడింది. అందులోనూ పోలెమ్మ స్వర్గానికి వెళ్లిన రోజుగా భక్తులు భావించే కార్తీక మాసం చివరి రోజు కావటంతో తెల్లవారుజామున 4గంటల నుండే భక్తులు గోదావరికి పోటెత్తారు. రాజమండ్రి నగరంలో ఇటు దేవీచౌక్ నుండి, అటు కోటగుమ్మం సెంటర్ నుండే రోడ్లపై భక్తుల సంఖ్య అధికంగా కనిపించింది. తెల్లవారిన తరువాత 8గంటల వరకు కూడా రాజమండ్రిలోని స్నానాల ఘాట్లలో భక్తులు అధిక సంఖ్యలో పుణ్యస్నానాలు చేస్తూనే ఉన్నారు. మహిళా భక్తులు గోదావరి తల్లికి పూజలు చేసి, నదిలో అరటి డొప్పల్లో దీపాలు వదిలారు. రాజమండ్రి నగరంలోని పుష్కర్‌ఘాట్, కోటిలింగాలఘాట్, గౌతమఘాట్, సరస్వతిఘాట్ తదితర ఘాట్లలో భక్తులు అధిక సంఖ్యలో పుణ్యస్నానాలు చేసారు.