పశ్చిమగోదావరి

శివోహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచాక్షరి నామంతో మార్మోగిన గోదావరి తీరం
పోలవరం, మార్చి 7: మహా శివరాత్రి పర్వదినాన్న పట్టిసంలో శివ నామస్మరణ మార్మోగింది. శివ క్షేత్రంలో ఉత్సవాలు సోమవారం తెల్లవారుఝాము నుండి ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయ ధర్మకర్త కుటుంబ సభ్యులు తెల్లవారుఝామున 1గంటకు శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామివారికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేయించారు. ఆ తర్వాత వేద పండితులు పంచామృతాలతో వీరేశ్వర స్వామివారిని అభిషేకించారు. అనంతరం 2గంటలకు భక్తులందరికీ స్వామివారి దర్శనానికి అనుమతించారు. దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు పటిష్టంగా చేశారు. వివిధ ప్రాంతాల నుండి పట్టిసం చేరుకున్న భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానం చేసి, దైవ దర్శనం చేసుకున్నారు. మరికొంత మంది పితృదేవతలకు పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుఝామున స్వామివారి దర్శనానికి వచ్చిన జిల్లా ఎస్పీ భాస్కర భూషణ్, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావులకు ఆలయ ఇవో విశ్వనాధరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేద పండితులు వారిచే ప్రత్యేక పూజలు చేయించారు. గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు స్వామివారిని దర్శించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఆలయం వెనుక వైపునుండి మూడు కిలోమీటర్ల ఇసుక తినె్నలపై నుండి నడిచి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పూజలు చేయించుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల వాహనాలు పట్టిసం రేవువద్దకు రాకుండా పోలీసులు నియంత్రించడంతో రోడ్డుపై ట్రాఫిక్ ఇబ్బందులు కలగలేదు. లాంచీలు ఎక్కేందుకు వీలుగా నిర్మించిన ఫ్లాట్ ఫారంలు ఆరు నిర్మించడంతో నది దాటేందుకు ఎక్కువ సమయం వేచి ఉండవలసి అవసరం భక్తులకు కలగలేదు. స్పీడ్ బోటులో కొవ్వూరు ఆర్డీవో బి శ్రీనివాసరావు నదిలో తిరుగుతూ పెర్రీ పాయింట్ల వద్ద పరిస్థితిని పరిశీలించి, ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే సిబ్బందికి తగు సూచనలు ఇచ్చి చక్కదిద్దారు. ఉత్సవాలలో నాలుగు వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి, ఆక్సిజన్ సిలెండర్లు, ఉచిత మందులు అందుబాటులో ఉంచారు. భక్తులు దైవదర్శనానికి వచ్చి ఇబ్బందులు పడకుండా దర్శనం చేసుకుని ఆనందంతో వెనుతిరిగారు. జంగారెడ్డిగూడెం డిఎస్పీ జె వెంకట్రావు ఆధ్వర్యంలో 800మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేశారు. ఈ సంవత్సరం ఉత్సవంలో భక్తులు ఎటువంటి అసౌకర్యాన్ని పొందలేదు..అయితే పెర్రీ పాయింట్ నుండి ఆలయం వరకూ భక్తులు సేద తీరేందుకు వేసిన చలువ పందిర్లు తాటాకులతో కాకుండా ఐరన్ పైపులు, బరకాలతో వేయడం వల్ల ఎండ వేడిమికి భక్తులు తల్లడిల్లారు. తాటాకుల పందిర్లు స్థానే ఐరన్ పైపులతో బరకాలతో పందిర్లు వేస్తున్నారని, దీనివల్ల భక్తులు ఇబ్బందులు పడతారని ఉత్సవ ఏర్పాట్ల సమీక్షా సమావేశంలో పలువురు అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందని వాఖ్యానించారు. డిపిఒ ఆర్‌వి సూర్యనారాయణ, హౌసింగ్ పిడి వి శ్రీనివాసరావు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీవోలు బి శ్రీనివాసరావు, ఎస్ లవన్నలు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలుగకుండా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించారు.