బిజినెస్

మెరిసిన పుత్తడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మళ్లీ రూ 26 వేలకు చేరిక
న్యూఢిల్లీ, డిసెంబర్ 12: విదేశీ మార్కెట్లలో స్థిరమైన ధోరణుల కారణంగా, అలాగే పెళ్లిళ్ల సీజన్ డిమాండ్‌ను తట్టుకోవడం కోసం అభరణాల తయారీదారులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరపడంతో శనివారం బులియన్ మార్కెట్లో బంగారం ధరలు 290 రూపాయలు పెరిగి తిరిగి పది గ్రాములు రూ. 26 వేల స్థాయికి చేరుకుంది. అయితే డిమాండ్ పెద్దగా లేకపోవడం వల్ల వెండి రూ. 200 మేర నష్టపోయి కిలో 33,850 రూపాయలకు చేరుకుంది. విదేశీ మార్కెట్లో పటిష్ఠమైన ధోరణులు, ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్ డిమాండ్‌ను తట్టుకోవడం కోసం ఆభరణాల తయారీదారులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరపడమే బంగారం ధరలు పెరగడానికి కారణమని బులియన్ వ్యాపారులు అంటున్నారు. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం 290 రూపాయలు పెరిగి పది గ్రాములు రూ. 26 వేలకు పెరగ్గా, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం కూడా అదే స్థాయిలో పెరిగి రూ. 25,850కు చేరుకుంది.