ఆంధ్రప్రదేశ్‌

నెల్లూరులో బంగారు వర్తకుల ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు , మార్చి 10: కేంద్ర ప్రభుత్వం బంగారంపై విధించిన 1 శాతం ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తి వేయాలని ఎపి బులియన్ గోల్డ్ సిల్వర్ అండ్ డైమండ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం నెల్లూరులో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నగర ఎమ్మెల్యే డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ డిప్యూటి మేయర్ ముక్కాల ద్వారకానాథ్ వారికి సంఘీభావం ప్రకటించి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం బంగారు వ్యాపారులను కేంద్రం బంగారంపై విధించిన ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేయాలన్నారు. ఇందుకోసం ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమకారంతో అసెంబ్లీలో, పార్లమెంటులో ప్రస్తావిస్తామన్నారు. బంగారు, స్వర్ణకారులు పదిరోజులుగా ఆందోళనలు నిర్వహిస్తుంటే ప్రభుత్వానికి చలనం లేకపోవటం బాధాకరమన్నారు. అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రధాని మోదీ అన్ని పన్నులు రద్దు చేసి ఏక పన్ను విధానం తీసుకువస్తామని నమ్మబలికి ఈ విధంగా దేశవ్యాప్తంగా బంగారు వ్యాపారులను , పనివారలను దెబ్బతీయటం సరికాదన్నారు.