హైదరాబాద్

బంగారు నగల కోసం దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, నవంబర్ 27: ఆ జంట జల్సాలకు అలవాటుపడింది. వాటికి అవసరమైన డబ్బు కోసం దొంగతనానికి పాల్పడింది. అయినా ఆ మొత్తం సరిపోకపోవడంతో ఏకంగా ఒక వృద్ధురాలిని హత్య చేసి ఉన్నదంతా దోచుకోవాలని ప్లాన్ వేశారు. ఆ మేరకు ఆమెను హత్య చేసి 60 తులాల బంగారం, ఇతర విలువైన వస్తువులను అపహరించారు. అయితే వారి పాపం సంవత్సరం తర్వాత బయటపడింది. వృద్ధురాలి హత్యకేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు సంవత్సరం తర్వాత నిందితులను పట్టుకున్నారు. పశ్చిమ మండల డిసిపి ఎ.వెంకటేశ్వర రావు శుక్రవారం విలేఖరులకు వివరాలను వెల్లడించారు. లంగర్‌హౌస్ పరిధి జ్యోతినగర్‌లో ఓ ప్రభుత్వ రిటైర్డు అధికారి భార్య అయిన లక్ష్మీతులసిని కత్తితో పొడిచి అతిదారుణంగా హత్యచేసిన సంఘటన గత యేడాది సంచలనం సృష్టించింది. కాగా హంతకుల కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినా దొరకలేదు. ఏ ఒక్క ఆధారం లభించలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుల్లా అటు లంగర్‌హౌస్ పోలీసులతో పాటు ఇటు టాస్క్ఫోర్స్ పోలీసులు కూడా దర్యాప్తు చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఎట్టకేలకు చిన్న ఆధారంతో వృద్ధురాలిని ఆమె ఇంటి సమీపంలో నివసించిన అనూష, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసినట్టు నిర్ధారించి నిందితులను పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా మేట్‌పల్లికి చెందిన మేదం అనూషాకు ఇంటర్‌లో కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం ఉప్పాదుగా గ్రామానికి చెందిన నర్సయ్య కుమారుడు కొత్తకొండ రాజశేఖర్ అలియాస్ శేఖర్ పరిచయం అయ్యాడు. అయితే అనూష ఉన్నత చదువులకోసం మెహిదీపట్నంలోని ఓ మహిళా హాస్టల్‌లో ఉండేది. అనంతరం ఆమెకు గోపితో వివాహం జరిగింది. ఈక్రమంలో మళ్లీ చదువుల కోసం అనూష నగరానికి వచ్చింది. తాను కూడా హైదరాబాద్‌లో పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తానని అనూష ప్రియుడు రాజశేఖర్ కూడా నగరానికి వచ్చి జ్యోతినగర్‌లో ఇద్దరూ కలిసి ఉండేవారు. కాగా యేడాది క్రితం వీరికి డబ్బులు అవసరం పడటంతో ఆదే ప్రాంతంలో ఉన్న లక్ష్మీతులసీ అనే వృద్ధురాలి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. మళ్లీ కొన్ని రోజుల అనంతరం లక్ష్మీతులసిని హత్యచేసి ఇంట్లో ఉన్నదంతా దోచుకోవాలని పన్నాగం పన్నారు. ఈక్రమంలో గత యేడాది అక్టోబర్ 15న ఇంట్లోకి ప్రవేశించి లక్ష్మీతులసీని అతిదారుణంగా కత్తితోపొడిచి హత్య చేశారు. ఇంట్లో ఉన్న 60తులాల బంగారు నగలతో పాటు విలువైన వస్తువులను అపహరించారు. ఈ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. కాగా టాస్క్ఫోర్స్ పోలీసులు రాజశేఖర్‌తో పాటు అనూషను పట్టుకుని విచారించగా తామే లక్ష్మితులసీని హత్యచేసినట్టు ఒప్పుకున్నారు. వారిని లంగర్‌హౌస్ పోలీసులకు అప్పగించారు. రాజశేఖర్, అనూష వద్ద సుమారు తొమ్మిది తులాల బంగారు నగలు, ఓ లాప్‌టాప్, ఓ సెల్‌ఫోన్‌తో పాటు కొన్ని అమెరికా డాలర్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రెండున్నర లక్షల రూపాయలు ఉంటుందని డిసిపి పేర్కొన్నారు. లక్ష్మీతులసి హత్య కేసును ఛేదించిన టాస్క్ఫోర్స్ పోలీసులు, ఆసిఫ్‌నగర్ ఏసిపి గౌస్ మొహినొద్దీన్‌తో పాటు లంగర్‌హౌస్ ఇన్‌స్పెక్టర్ ఎంఎ జావేద్‌ను డిసిపి అభినందించారు.