రాష్ట్రీయం

గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు ఈరోజు మధ్యాహ్నాం చెన్నై ఆసుపత్రి చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎనభై సంవత్సరాల గొల్లపూడి మారుతీరావు దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించారు. 1939 ఏప్రిల్ 14 జన్మించిన గొల్లపూడి జన్మస్థలం విజయనగరం. తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావులకు ఐదవ సంతానం. డిగ్రీ వరకు చదివిన గొల్లపూడి 13వ ఏటే ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం సంపాదించారు. తదనంతర 14 ఏళ్లకే తొలి కథ ‘ఆశాజీవి’ రాశారు. బహుముఖ ప్రజ్ఞాశీలి అయిన గొల్లపూడి చాలామందికి నటుడిగానే తెలుసు. కాని ఆయన అనేక నవలలు, కథలు, నాటకాలు రాశారు. ప్రఖ్యాత దర్శకులు కె. విశ్వనాథ్ తొలి చిత్రం ఆత్మగౌరవం చిత్రానికి రచయితగా పనిచేశారు. డాక్టర్ చక్రవర్తి చిత్రానికి నంది పురస్కారం అందుకున్నారు. అలాగే ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య చిత్రంతో నటుడుగా ప్రవేశం చేశారు. సంపాదకునిగా జీవిత ప్రయాణం మొదలుపెట్టిన ఆయన మాటల రచయితగా చిత్ర పరిశ్రమలోనూ, వ్యాఖ్యాతగా టీవీ రంగంపైనా తనదైన ముద్ర వేశారు. ఆయన కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్ పేరుతో ఫౌండేషన్‌ను ఏర్పాటుచేసి ప్రతి ఏటా ఆగస్టు 12న ఉత్తమ ప్రతిభ కనబరిచిన డెబ్యూ డైరక్టర్‌కు అవార్డును అందజేస్తున్నారు. డాక్టర్ మారుతీరావుకి మన దేశంలోనే కాకుండా విదేశాల్లోని పలు సాహీతి సంస్థలు ఆహ్వానించి పురస్కారాలను, అవార్డులను అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నాయి. డాక్టర్ చక్రవర్తి చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా, ఆత్మగౌరవం చిత్రానికి ఉత్తమ రచయిత, కళ్లు సినిమాకు ఉత్తమ రచయిత, మాస్టారి కాపురం చిత్రానికి సంభాషణల రచయితగా పురస్కారాన్ని అందుకున్నారు. 2002లో రాజాలక్ష్మీ ఫౌండేషన్ పురస్కారాన్ని అందుకున్నారు. ఇంకా పలు సాహిత్య అవార్డులను ఆయన అందుకున్నారు. కాగా గొల్లపూడి మారుతీరావు నటించిన ఆఖరి చిత్రి జోడీ. డాక్టర్ మారుతీరావు మృతికి సంతాపం తెలియజేస్తూ సినీ రంగానికి చెందిన పలువురు నివాళులర్పించారు.

తెలుగు రాష్ట్రాల సీఎంలు సంతాపం
ప్రముఖ నటుడు, సాహీతీవేత్త గొల్లపూడి మారుతీరావు మృతికి ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన సీఎంలు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన సేవలను సీఎం కేసీఆర్ కొనియాడారు. ఎన్నో పరిశోధనాత్మక రచనలు చేశారని, తెలుగు భాషాభివృద్ధికి ఆయన అందించిన సేవలు నిరుపమానం అని అన్నారు. ఏపీ సీఎం తన సంతాపం సందేశంలో గొల్లపూడి మృతి వల్ల తెలుగు సినీ పరిశ్రమ మంచి వ్యక్తిని కోల్పోయిందని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తన సంతాప సందేశంలో..మంచి నటుడు, రచయితను కోల్పోయామని పేర్కొన్నారు.