రాష్ట్రీయం

పట్టాలు తప్పిన గూడ్సు రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ- భువనేశ్వర్ మార్గంలో నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు

విజయనగరం, డిసెంబర్ 21: విజయనగరం జిల్లా చీపురుపల్లి- గరివిడి మండల కేంద్రాల మధ్య కొండలక్ష్మీపురం వద్ద సోమవారం ఉదయం గూడ్సు రైలు పట్టాలు తప్పిన సంఘటనలో ఏడు బోగీలు ధ్వంసమయ్యాయి. గూడ్సు బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోవటంతో అప్.. డౌన్.. రెండు లైన్లలోనూ రైల్వేట్రాక్ భారీగా దెబ్బతింది. ట్రాక్‌కు ఇరుపక్కల ఉన్న విద్యుత్ లైన్లు కూడా దెబ్బతిన్నాయి. ఫలితంగా రైల్వేట్రాక్ భారీగా దెబ్బతిన్న కారణంగా మంగళవారం సాయంత్రం వరకు ఈ మార్గంలో రైళ్లు నడిచే అవకాశం లేదని రైల్వే వర్గాలు తెలిపాయి. కాకినాడ నుంచి భువనేశ్వర్‌కు యూరియా స్టాకుతో వెడుతున్న గూడ్సు రైలుకు చెందిన ఏడు బోగీలు ఉదయం 11.30ప్రాంతంలో కొండలక్ష్మీపురం వద్ద పట్టాలు తప్పాయి. ముందు కొన్ని బోగీలు, వెనక వైపు ఉన్న మరికొన్ని బోగీలు మామూలుగానే ఉండగా మధ్యలో ఉన్న ఏడు బోగీలు మాత్రం పట్టాలు తప్పి బోల్తాపడ్డాయి. ఫలితంగా కొన్ని ఫర్లాంగుల మేరకు రైల్వేట్రాక్ దెబ్బతింది. రైల్వేట్రాక్ విరిగిపోయి వంగిపోయింది. ఒక పట్టా బోగీలోకి చొచ్చుకుపోయింది. ట్రాక్‌కు ఇరువైపులా ఉన్న విద్యుత్ లైన్ కూడా దెబ్బతింది. బోగీలు ధ్వంసమయి అందులో ఉన్న ఎరువుల బస్తాలు బయటకు పడిపోయాయి. ప్రమాద సంఘటన గురించి గూడ్స్ రైలు డ్రైవర్ రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ముందు బోగీలను చీపురుపల్లి వైపు, వెనక బోగీలను నెల్లిమర్ల వైపు మళ్లించారు. విశాఖ- భువనేశ్వర్ మార్గంలో నడిచే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను టిట్లాగర్, సంబల్‌పూర్, కుర్దా రోడ్డు మీదుగా దారి మళ్లించారు. విశాఖ-పలాస మధ్య నడిచే అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసారు. మంగళవారం సాయంత్రానికి ఒక లైన్‌ను పునరుద్ధరించి సింగిల్ లైన్‌లో రైళ్ల రాకపోకలను ప్రారంభించేందుకు రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు లైన్లు పూర్తిస్తాయిలో పునరుద్ధరించడానికి కనీసం 48గంటలు పడుతుందని రైల్వేవర్గాలు చెబుతున్నాయి.