Others

ఆశ ఖరీదు అణా I గోరాశాస్ర్తి గారి రేడియో నాటిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యు:నిద్ర రావటంలేదు ఎంత ప్రయత్నించినా! ఎంచేతో తెలిదయు! నిజంగా తెలీదా? పొద్దున్నించీ కడుపుమాడిపోతుంటే నిద్ర ఎలా వస్తుంది? ఉంగరం అమ్మేస్తే వచ్చిన డబ్బు గది అద్దె అడ్వాన్సుకే చాలలేదు. మిగిలింది నేనూ నా బొమ్మలూ! ఎటొచ్చీ మేకులు కొడితే ఇందిర నిద్రపోయిది. బొమ్మలు చూస్తే కృష్ణవేణి హడలిపోతుందనుకుంటాను. వియోగం, దుఃఖం, గులాబీ తోటలో కాలసర్పం- ఇలాంటి బొమ్మలే ఎందుకు వేస్తాను చెప్మా? ఎలాగైనా కృష్ణవేణికి ఆ బొమ్మలు చూపించాలి.. మళ్లీ కృష్ణవేణి అంటున్నాను! ఆ అమ్మాయి పేరేమిటో?
***
కృష్ణవేణి: ఆ అబ్బాయి పేరేమిటో! ఏవిఁరా అన్నయ్య- ఆయన పేరేవిటి?
అన్నయ్య:ఎవరిపేరే?
కృష్ణ:అదేరా - పై మేడ చివరి గదిలో కొత్తగా దిగాడే...
అన్న:ఎవడో సుబ్బారాయుడు! మనకెందుకొచ్చిన గొడవ, పడుకుందూ- అర్థరాత్రి కావస్తోంది-
కృష్ణ:(నవ్వుతూ) భలేవాడివిరా, సాయంత్రం ఎనిమిదింటికే చీకటంటావేమిట్రా ఖర్మ! కాస్సేపు కూర్చుని ఏవేనా కబుర్లు చెప్పరాదూ! అమ్మ కప్పుడే మూడో ఝాము నిద్ర.
అ:చెప్పడానికి నాకేం కబుర్లుంటాయి.. బెంగెట్టుకు ఛస్తుంటేను! ఎందుకూ పనికిరాని చవట వాజెమ్మని.. కాణీ ఆర్జించలేనివాణ్ణి!
కృష్ణ:పోనీలేరా.. ఆ గొడవంతా దేనికిప్పుడూ.. ఎవరార్జిస్తేనేం? ఏదో యిలా బతుక్కొస్తున్నాం. సంతోషించకూడదూ?
అ:నీకేం చెపువు. నీ మట్టుకు నీకేదో గొప్పగా ఉన్నట్టుండి కాని.. నీ చేత ఉద్యోగం చేయించవలసిన ఖర్మ పట్టిందంటే - అమ్మకి ఎంత రంపపు కోత- నాకెంత అవమానం-
కృష్ణ:మొదలెట్టా వా పురాణం! ఈ నాలుగు ఘడియలైనా నన్ను కాస్త తృప్తిగా ఊపిరి పీల్చుకోనియ్యవ్.. తెల్లారగట్ల లేచి వంటపని, పగలల్లా ఆఫీసులో బండచాకిరీ-ఇంటికొచ్చాక మళ్లీ వంట.
అ:ఆ తరవాత తీరిగ్గా కూర్చుని అల్లా అబ్బాయి పేరేమిటీ, ఇల్లీఅబ్బాయి పేరేమిటీ అని ఆలోచన్లు. దేవుడి ధర్మమా అని నాకు ఉద్యోగమే దొరికితే-
కృష్ణ:తక్షణం నన్ను ఉద్యగం మానిపించి ఇంట్లో కూచోబెడతావు, అంతేనా? అక్కడికి కాని నీకు మనశ్శాంతి ఉండదు. ఏం మనుషులంరా మనం? సగం చచ్చిన మనుషుల్ని గాని ప్రేమంచలేం; నా బ్రతుకులో ఏ మారుమూలైనా కాస్త సంతృప్తి మిగిలిపోతే, దాన్ని విసిరి అవతల పారేసేదాకా నీకు తోచదు. నన్ను నువ్వు ఇంతగా అనిమానించకపోయినా బాగుండును! కాస్తయినా ఉసఖపడేదాన్ని!
***
యు:అప్పడే సందడి తగిగపోతూంది. మేడలో దీపాలు ఒక్కొక్కటే ఆరిపోతున్నాయి. పాపాయిలు నిద్రపోయారు! వాళ్ళ తల్లులూ నిద్రపోయారు. హాయిగా... ఒంటరితనం ఎంత భయంకరం! చేతిలో కానీ లేదు. అనా రేపు ఎలా గడుస్తుందన్న భయం లేదు. తిండి లేకపోయినా అంత బాధలేదు. ఎంత ఆకలి రాత్రయినా తెల్లారక తీరదు. అలాగే శాశ్వతంగా కన్నుమూస్తే మరి చింతే లేద. కానీ రుూ ఒంటరితనం ప్రపంచంలో ‘నా’ అన్నవాడు ఒక్కరు- ఒక్క ప్రాణి లేకపోతే ఏం దారి? ఏవిటో భాగారంలో శేషంలా నేనొక్కణ్ణీ ఇలా మిగిలిపోయాను! తిండికోసం వెతుక్కుంటూ.. పింఛను తాతగారల్లే ఉందే? ముసలాయనకి నిద్రపట్టడంలేదు కాబోలు!
తా:ఏం నాయనా! ఇంకా నిద్రపోలేదూ! మేడముందు పచార్లు చేస్తున్నవ్!
యువ:లేదు తాతాగారూ! ఏవిటో నిద్రపోవాలనిపించడంలేదు! రోడ్డుమీది వింతల్ని చూస్తూ పిచ్చిగా ఆలోచిస్తూ-

తా: నిద్రపో నాయనా! నిద్రపో! మేలుకుంటే ఏవుంది- బెంగలూ భయాలూ తప్ప!
యు:మరి మీరు నిద్రపోలేదే తాతగారూ!
తా:నిద్ర! నాకు ఏ రకంగా ఒక్కసారే నిద్ర! పెద్దకోడలు ప్రసవ వేదనలో వుంది. చిన్నకోడలికి జ్వరం! ఆ తీవ్రంలో ఒకటే పలవరింతలు! చేతిలో కానీ లేదు. అవునా! ఇలాంటప్పుడు నాకెందుకో నవ్వొస్తుంది! నేన్నవ్వితే మా ధర్మపత్నికి కోపం. మనందరం అసలు ఎందుకు పుట్టామా అన్న ప్రశ్న ఇప్పుడు తేల్చమంటుంది- రుూ అర్థరాత్రి! ఎలాగుందంటావ్?
యు:దివ్యంగా ఉంది! పోనీ కాస్సేపు ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుందాం.
తా: అలా అన్నావు బాగుంది. ఉండు, ఓ చుట్ట వెలిగించి నీకు నా అనుభవాలన్నీ చెపుతాను. చూడూ, నువ్వు చుట్ట కాల్చగలవా?
యు:కాల్చగలను కాని నేనెప్పుడూ కాల్చేవి బీడలు ఉన్నాయిలెండి నా దగ్గిర...
తా:ఏవో ఓకటిలే! కాల్చడం ప్రధానం. మీ అమ్మా, నాన్నా ఏ వూళ్ళో ఉన్నారు నాయనా?
యు:స్వర్గంలో
తా:మంచిది. సరే, యిల్లాలు లేదని నిన్ననే చెప్పావు. పోనీ ఏదైనా ఉద్యోగం చేసుకుంటున్నావా?
యు:అదీ లేదండి! ఇచ్చేవాడెవ్వడూ లేడు
తా:ఇంకేం! సుఖపడ్డావ్. వీలయినకాడికి ఉద్యోగాలు చెయ్యకుండా బతకడానికి ప్రయత్నించు. ఇదంతా ఉత్త మాయ నాయనా! నేను చేసి చూశాను. ముప్ఫయి మూడు సంవత్సరాలు- చివరికి ఏం మిగిలింది?

- సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)