రాష్ట్రీయం

నాయనివారిపల్లెలో భారీ గోతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బుగ్గమల్లేశ్వరస్వామి ఆగ్రహించాడని జనం బెంబేలు..
* సున్నపురాయి వల్లేనని భూగర్భశాఖ అధికారుల నిర్ధారణ
కడప : జిల్లాలో గత ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కడప సమీపంలోని నాయనివారిపల్లెలో పెద్దఎత్తున నీటితో కూడిన గోతులు ఏర్పడడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దీనికితోడు ఆ గ్రామంలో ఒకొక్కటిగా ఇళ్లు కుప్పకూలుతుండటంతో అందరినీ ఖాళీ చేయించి కడప గాంధీనగర్ పునరావాస కేంద్రానికి తరలించారు. విషయం తెలియడంతో ఆదివారం జిల్లా కలెక్టర్ కెవి రమణ, భూగర్భ జల శాఖ అధికారులు నాయనివారిపల్లెను సందర్శించారు. ఇదిలా ఉండగా ఆ గోతులు సున్నపురాయి వల్లే ఏర్పడ్డాయని భూగర్భశాఖ అధికారులు నిర్ధారిస్తున్నారు.