జాతీయ వార్తలు

సీఎం మమత చర్య రాజ్యాంగ విరుద్ధం:గవర్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సీఎం మమతా బెనర్జీ, మంత్రులు నిరసన ర్యాలీ చేపట్టడాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ తప్పుబట్టారు. గత మూడు రోజులుగా నిరసనలతో అట్టుడుకుతున్న రాష్ట్రాన్ని అదుపులోనికి తీసుకురావాల్సింది పోయి నిరసన ర్యాలీకి పిలుపునిస్తారా? ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని గవర్నర్ ట్వీట్ చేశారు. కాగా పౌరసత్వ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఈ రోజు మధ్యాహ్నాం రెడ్ రోడ్‌లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాం నుంచి జోరాసంకో థాకూర్బారి వరకు ర్యాలీ నిర్వహించేందుకు సీఎం మమత బెనర్జీ పిలుపునిచ్చారు. ఈ ర్యాలీకి తరలిరావాల్సిందిగా ఆమె ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.