రాష్ట్రీయం

తెలుగు యూనివర్శిటీ ఆంధ్రా సెంటర్లకు నిధులు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, నవంబర్ 23: హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన ఎపిలోని కేంద్రాలకు ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ వ్యయం కోసం నిధులు మంజూరు చేస్తూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న ఎపిలోని రాజమండ్రి, శ్రీశైలం, కూచిపూడి కళాక్షేత్రం ప్రాంగణాల్లో సేవలందించేందుకు గాను కోర్టు ఉత్తర్వులను అనుసరించి రూ.4,36,67,616 నిధులు మంజూరు చేస్తూ ఎపి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల్లో తొలిదశగా రూ.2,17,33,808లను తక్షణమే విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మిగిలిన రూ.2,17,33,808 మొత్తాన్ని 2016 జనవరిలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ నిధులను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ వినియోగించుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది.
పలు రైళ్ల పునరుద్ధరణ
హైదరాబాద్, నవంబర్ 23: గంతకల్లు డివిజన్‌లో గుత్తి-రేణిగుంట సెక్షన్‌లో రాజంపేట-పుల్లంపేట, నందలూరు-మంటపంపల్లె స్టేషన్ల మధ్య రైల్వే లైన్లపై నుంచి వరద నీరు ప్రవహించడంతో ఆ రూట్లో రద్దు చేసిన రైళ్లను తిరిగి సోమవారం నుంచి పునరుద్దరించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైలు నెం.11018 కరైకల్-లోకమాన్యతిలక్ ఎక్స్‌ప్రెస్, నెం.11041 సిఎస్‌టి ముంబయి-చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్, నెం.11028 చెన్నై సెంట్రల్-సిఎస్‌టి ముంబయి ఎక్స్‌ప్రెస్, నెం.17651 చెన్నై ఎగ్మోర్-కాచిగూడ ఎక్స్‌ప్రెస్, నెం.17652 కాచిగూడ-చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్, నెం.16381 సిఎస్‌టి ముంబయి-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లను పునరుద్దరించినట్లు తెలిపింది. అలాగే 24వ తేదీన నెం.16382 కన్యాకుమారి-సిఎస్‌టి ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్దరిస్తున్నట్లు రైల్వే వెల్లడించింది.
డ్రాయింగ్, హేండ్‌లూమ్ పరీక్షల
ఫీజు చెల్లింపు గడువు డిసెంబర్ 7
హైదరాబాద్, నవంబర్ 23: డ్రాయింగ్, హేండ్లూమ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ విభాగాల్లో టెక్నికల్ సర్ట్ఫికెట్ కోర్సుల్లో లోయర్, హయ్యర్ గ్రేడ్ విభాగాల్లో పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు డిసెంబర్ 7వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ఎపి ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు ఒక ప్రకటనలో తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో డిసెంబర్ 12 వరకు, రూ.75 అపరాధ రుసుముతో డిసెంబర్ 21లోగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. 7వ తరగతి ఉత్తీర్ణులైన ఎపిలోని 13 జిల్లాల అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. డ్రాయింగ్ లోయర్‌కు రూ.100, హయ్యర్‌కు రూ.150, హేండ్లూమ్ వీవింగ్ లోయర్‌కు రూ.150, హయ్యర్‌కు రూ.200, టైలరింగ్ ఎంబ్రాయిడరీ లోయర్‌కు రూ.150, హయ్యర్‌కు రూ.200 పరీక్ష ఫీజుగా అభ్యర్థులు చెల్లించాలని తెలిపింది.
కేంద్ర సర్వీసుల నుంచి ఏపిలో చేరిన ఐపిఎస్ అధికారి
హైదరాబాద్, నవంబర్ 23: కేంద్ర సర్వీస్‌లోకి డిప్యూటేషన్‌పై సిఆర్‌పిఎఫ్ డిఐజిగా వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐపిఎస్ అధికారి మహేశ్‌చంద్ర లడ్డా డిప్యూటేషన్ కాలపరిమితి పూర్తవడంతో ఎపి పోలీస్ శాఖకు తిరిగి వచ్చారు. ఆయన గత నెల 28న ఎపి పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేశారు. ఆ విషయాన్ని ధృవీకరిస్తూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.