జాతీయ వార్తలు

జెట్ ఛైర్మన్ గోయల్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జెట్ ఎయిర్ వేస్ సంస్థ ఛైర్మన్ పదవికి నరేశ్ గోయల్ రాజీనామా చేశారు. ఆయన భార్య అనిత కూడా డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. 1993లో నరేశ్ గోయల్ జెట్ ఎయిర్‌వేస్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం సంస్థలో గోయల్‌కు 51శాతం వాటా వుంది. అయితే సంస్థ తీవ్ర ఆర్థిక కష్టాల్లో చిక్కుకుని కనీసం జీతాలు చెల్లించలేని పరిస్థితికి వచ్చింది. జెట్ ఎయిర్‌వేస్‌ను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలంటే వృత్తి నిపుణుల చేతికి అప్పగించటమే బ్యాంకర్లు ప్రతిపాదించారు. దీంతో ఛైర్మన్ గోయల్ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. కాగా గోయల్ రాజీనామాతో జెట్ ఎయిర్‌వేస్ షేర్లు రాణించాయి.