గ్రహానుగ్రహం

ధనుర్మాసంలో శుభ కార్యములు చేయరాదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరికృష్ణ (తుమ్మలపల్లి)
ప్రశ్న: ధనుర్మాసం (నెల పట్టడం)లో శుభ కార్యములు చేయరాదు అంటారు. ఇది నేడు మనకు ఆచరణలో లేదు. శాస్త్రం ఏమైనా మారినదా?
జ: శాస్త్రంలో మార్పులు రాలేదు. ఇది ‘ఆచారం - శాస్త్రం’ అనే ప్రాతిపదికతో తీసుకున్న మార్పు. మనం సౌరమాన విశేషములు చాంద్రమాన విశేషములు కూడా పరిగణనలోకి తీసుకోవడం, ‘ఆపస్తంబ సూత్రం’ వంటి గృహ్య సూత్రములు పరిశీలిస్తే చాలా విశేషములు బయటపడతాయి. ధనుర్మాసం శాస్తమ్రా? ఆచారమా? అనేది యోచిస్తే ‘మిథున కుంభా మృగాళి వృషా జగే మిథున గేపి రవౌ త్రిలవేషు శుభేః’ అని సౌరమాన రీత్యా చెప్పారు. మరొక మాట ‘అళిమృగా జగతే కరపీడనం కార్తీక పౌష మధుష్వపి’ అని చెప్పి మిథున, కుంభ, మకర, వృశ్చిక, వృషభ, మేష రాశులలో సూర్యుడు వుండగా వివాహము చేయుట శుభప్రదము. మిథునంలో రవి వుండగా ఆషాఢ మాసం వస్తుంది. మరి ఆషాఢం చేయవచ్చా? అని వెంటనే ప్రశ్న పుడుతుంది. సౌరమానం గ్రాహ్యం అనుకుంటే మిథున మాసం అంతా వివాహం చేయవచ్చు. కేవలం ధనుర్మాసం అంతా చేయరాదు. అందుకే తమిళ, కన్నడ రాష్ట్రాలలో ఆషాఢంలో వివాహములకు కారణం అయినది. భాద్రపద పుష్య మాసాలలో కూడా వారు వివాహాది శుభములు చేయుటకు కారణం. ఇక చాంద్రమానం ఏమి చెప్పింది. ‘మాఘ ఫాల్గుణ వైశాఖా జ్యేష్ఠ మాసాః శుభప్రదాః మధ్యమం కార్తీకే మార్గశీర్షేవై నిందితాః పరే’ మాఘ ఫాల్గుణ వైశాఖ జ్యేష్ఠ మాసములు శుభప్రదము అనియు కార్తీక మార్గశిర మాసములు మధ్యమము అని నారద సంహితాది గ్రంథములు తెలియజేసినాయి. మార్గశీర్ష మాసం చాంద్రమానం ప్రకారం గ్రాహ్యము. అయితే సౌరమానం ప్రకారం ధనుర్మాసం నిషేధం. తమిళనాడులోని శ్రీరంగంలో ఈ ధనుర్మాస నిమిత్తంగా గోదా కళ్యాణం విశేషములు చెబుతూ ధనుర్మాస వివాహాదులు నిషేధం చెబుతారు. మన చాంద్రమాన, సౌరమాన కలయికలో పౌషేపి మకర స్థేర్కే చైత్రే మేష గతేరవౌ, ఆషాఢే మిథునాదిత్యే కేత్యాయాః కరపీడనం’. ఇలా మకర మాసంతో కూడిన పుష్య మాసం మేష మాసంతో కూడిన చైత్రమాసం, మిథునంతో కూడిన ఆషాఢ మాసములను సమర్థించి అనేక గ్రంథములు చెప్పినవి. మీన చైత్రం, కన్యాభాద్ర పదం, ధనుః పుష్యం, మిథునాషాఢములు శూన్య మాసములు అని మన ఆంధ్ర దేశములోని శాస్తజ్ఞ్రుల నిర్ణయం. మరొక విచిత్ర విషయం ఏమిటి అంటే శ్రావణ మాసం విషయం ఎక్కడా కానరాలేదు. గృహ్య సూత్రాలలో ఆపస్తంభుడు ‘సర్వఋతవౌ వివాహస్య శైశిరౌమాసాసౌ పరీహ ప్యోత్తమంచ నైదాఘమ్’ అని చెప్పారు. దీని ప్రకారం శ్రావణం గ్రాహ్యమే అయినా ఆషాఢ, మాఘ, ఫాల్గుణాలలో నిషేధము అని చెప్పారు. దానికి కారణంగా ఈ మాసాలలో ‘అరుంధతి నక్షత్రం’ దృగ్గోచరము కాదు. కాబట్టి నిషేధించారు అని వైదీకులు చెబుతారు. శాస్త్ర ప్రకారం విశేష వాదనలు వుంటే వాటిని పరిగ్రహింపవచ్చు అని ఆపస్తంబుల వారే చెప్పిన కారణంగా మాఘ ఫాల్గుణాలు శాస్తత్రః నిషేధం లేని కారణంగా అందరూ ఆచరిస్తారు. ఇక శ్రావణం విషయం పక్కనపెడితే ‘ఆర్ద్రదావనిలాంత ఋక్ష దశకే సూర్యేస్థితేవా గురౌ సింహస్థే ప్యథవా తదంశకేగతే పూర్వదళే పారిఘే ఉద్వాహో నశుభః’ ఆర్ర్దా నక్షత్రం మొదలు స్వాతీ నక్షత్రం వరకు రవి సంచారం చేయు కాలము మరియు సింహంలో గురువు, సింహనవాంశలో గురువు వుండగా వివాహం చేయరాదు అని ఒకే సూత్రంలో వుండగా మనవారు ఇందులో సగం సూత్రం ప్రమాణంగాను (గురువు విషయంలో) సగం అప్రమాణంగా (ఆర్ద్ర నుండి స్వాతీ వరకు రవి సంచార కాలము) ప్రవర్తించడం అపహాస్య విషయం. ఇదే రీతిగా ధనుర్మాస విషయంలో సౌరమాస విషయంగా నిషేధము చాంద్రమానరీత్యా మార్గశీర్ష మాస గ్రాహ్యత, అలాగే ‘్ధనుః పుష్యం’ శూన్య మాసం విశేషములు. వీటి విశేషములతోనే మనవారు ధనుర్మాసంలో వివాహం అనే ఆచారం ప్రాధాన్యతతో కొందరు ‘గ్రాహ్యమే’ అని కొందరు ‘గ్రాహ్యం కాదు’ అని వాదులాడుకొంటారు. ఏదైనా 1990 - 1997 మధ్యలో ధనుర్మాసంలో వివాహం - విదేశాలలో ఉండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కోసం మారబడినది అనేది సత్యం.

కప్పగంతు సుబ్బరామశర్మ -9848520336