గ్రహానుగ్రహం

గ్రహానుగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ రుద్రాక్షలు ధరించాలి?
వెంగళరావు (విజయనగరం)
ప్రశ్న: జాతకరీత్యా ఉన్న దోషాలకు గ్రహాల రీత్యా రుద్రాక్షలు చెబుతున్నారు. మరి జాతకం లేనివారి విషయంలో ఏ రుద్రాక్షలు ధరించాలి అనేది ఎలా తెలుస్తుంది?
జ: జాతకం వున్నవారయినా లేదా లేనివారయినా సరే పంచముఖి రుద్రాక్షను ధరించవచ్చు. ఇక ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ఆరు ముఖముల రుద్రాక్ష ధరించాలి (షణ్ముఖం రుద్రాక్ష). అదే రీతిగా వ్యవహార ప్రతిబంధకములు తొలగుట కోసం (త్రిముఖి రుద్రాక్ష) మూడు ముఖముల రుద్రాక్షను ధరించాలి. విద్యార్థి దశలో వున్నవారు (చతుర్ముఖి రుద్రాక్ష) నాలుగు ముఖముల రుద్రాక్షను ధరించాలి. మరి సంఘంలో గౌరవ మర్యాదలు అధికంగా పొందవలెను అనుకునేవారి విషయంలో (సప్తముఖి రుద్రాక్ష) ఏడు ముఖముల రుద్రాక్ష మరియు తొమ్మిది ముఖముల రుద్రాక్ష (నవముఖి రుద్రాక్ష) ధరించాలి. అలాగే భార్యాభర్తలు అన్యోన్యం మరియు పార్ట్‌నర్స్ వ్యవహారములు సానుకూలం కోసం గౌరీ శంకరం రుద్రాక్షను ధరించాలి. ఇక మరొక ముఖ్య విషయం ఏమిటంటే రుద్రాక్ష ధారణలో కొన్ని నియమాలు ఉన్నాయి. అవి మీ గురువులను అడిగి తెలుసుకోండి. క్షౌరకాలము, నిదుర కాలము, పురుడు, మైల కాలము, మలమూత్ర విసర్జనా కాలములలో రుద్రాక్షలు ఉండరాదు.

శ్రీలక్ష్మి (ఉయ్యూరు)
ప్రశ్న: ఔషధ సేవకు (మందులు వాడటం మొదలుపెట్టుటకు) ఏమయినా నియమాలు ఉన్నాయా?
జ: ప్రతిరోజు పంచాంగంలో రాసే అమృత ఘడియల కాలము విశేషము. ఆ సమయంలో వైద్యం ఆరంభించుట శ్రేయస్కరం. ఇంక హస్తీత్రయే పుష్య పునర్వపౌచ విష్ణుత్రయే చాశ్వినీ పౌష్ణ భేషు మిత్రేందు మూలేషుచ సూర్యవారే బైషజ్యముక్తం శుభ వాసరేపి॥ హస్త, చిత్త, స్వాతి, పుష్యమి, పునర్వసు, శ్రవణ, ధనిష్ఠ, శతభిషం, అశ్వినీ, రేవతి, అనూరాధ, మృగశిర, మూలా నక్షత్ర దినముల యందును రవి, సోమ, బుధ, గురు, శుక్రవారములందును.. యోగ్య తిథిల యందును ‘శుద్ధేరిః ఫద్యున మృతిగృహే సత్త్ధినోజవేర్‌క్షే’ లగ్నాత్ పనె్నండు సప్తమ, అష్టమ స్థానములందు గ్రహములు లేకుండగాను ఔషధ సేవ ప్రారంభం చేయాలి. జన్మనక్షత్రంలో ఔషధ సేవ చేయకూడదు.

కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు)
కామకోటినగర్, శంకరమఠం వీధి, నృసింహ కృప బిల్డింగ్, విజయవాడ - 520 012.

కప్పగంతు సుబ్బరామశర్మ -9848520336