గ్రహానుగ్రహం

స్వక్షేత్రంలో కుజదోషం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: కుజుడు స్వక్షేత్రంలో వుంటే కుజదోషం ఉంటుందా? వుండదా?
దువ్వూరు యాజులు (విజయవాడ)
జ: కుజుడు ఒక్కో రాశిలో 40 రోజులు పాటుగా సంచారం చేస్తారు. మరి మేషం, వృశ్చికం, మకరంలలో సంచారం చేయునప్పుడు ఏ లగ్నంలో పుట్టిన వారికి అయినా కుజదోషం ఉండదు అనేది ఒక చర్చనీయాంశమైన విషయం. వ్యవసాయం విషయంలో క్రాప్ హాలీడే ఇయర్ అనే మాదిరిగా ఇక్కడ కుజుడు మేషంలో సంచారం చేస్తున్నాడు. ఇక నలభై రోజులు ఎవరు పుట్టినా ఏ లగ్నంలో పుట్టినా కుజదోషం ఉండదు అనేది హాస్యాస్పదంగానే గోచరిస్తోంది. కుజుడికి స్వక్షేత్రములయిన మేష, వృశ్చికములు, ఉచ్ఛరాశి అయిన మకరంలలో సంచారం చేయునప్పుడు ఆయనకు స్థానబలం ఎక్కువ ఉంటుంది. దోషం చేయు వాడికి బలం ఎక్కువ అయితే వాడు ఇంకా దోషం ఎక్కువ సృష్టించే అవకాశం ఉన్నది. కావున మేష స్థిత కుజుడు, వృశ్చిక స్థిత కుజుడు కుజదోషం ఇచ్చేవారు అనే గణన చేయాలి. మరి ఈ కానె్సప్ట్ ఎందుకు వచ్చింది అని అనుమానం రావచ్చు. దానికి సమాధానం మేష లగ్న జాతకులకు వృశ్చిక లగ్న జాతకులకు మకర లగ్న జాతకులకు కుజదోషం ఉండదు. అనగా జన్మలగ్నములు మేష, వృశ్చిక, మకరముల వారికి ఏ స్థానంలో కుజ సంచారం వున్ననూ వివాహ విషయమై కుజదోషం ఉండదు. ఇక మరొక విషయం చంద్రరాశులు మేష రాశి, వృశ్చిక రాశి, మకర రాశి అయితే కుజ దోషం ఉంది అని కొందరు, లేదు అని కొందరు వాదిస్తారు. ఇక్కడ లగ్నాత్ మరియు చంద్రాత్ కూడా కుజ దోషముల విషయం చర్చిస్తాం. కావున పై నియమాన్ని చంద్రరాశి సంచారం ప్రకారం జన్మరాశి మేషం, వృశ్చికం, మకరం అయినప్పుడు ఈ నియమం వర్తింపజేయవచ్చు. లగ్నం దేహము, చంద్రుడు మనస్సు - దేహము మనస్సు రెండూ కలిస్తేనే దాంపత్య జీవనమునకు అర్థం ఉంటుంది. దేహం కలిసి మనస్సు కలవకపోయినా మనస్సు కలిసి దేహం కలవకపోయినా ఈ సంసార జీవనమునకు అర్థం ఉండదు కదా? అందుకే కుజదోషం లగ్నాత్ చంద్రాత్ కూడా చూడవలెను.
ప్రశ్న: వివాహ పొంతనలలో పర్సంటేజ్ అని కంప్యూటర్ ప్యాకేజీలు చూపుతున్న విధానం సరి అయినదేనా? వివాహ పొంతనలలో ఇంకా ఏయే విశేషాలు పరిశీలించాలి.
జానకి ఎల్. (నంద్యాల)
జ: జాతకం కుదిరింది - కుదరలేదు అనే చెప్పాలి. అంతేకానీ పర్సంటేజ్ ప్రకారం చెప్పే విధానం చాలా తప్పు. 70 శాతం కుదిరింది అనుకుందాం. మరి 30 శాతం వైవాహిక జీవితం ఏయే అంశాలలో కుదరలేదు అని చెప్పాలి. అందుకోసమే మన ప్రాచీనులు కుదిరింది లేక కుదరలేదు అనే రెండు పాయింట్లు మాత్రమే చెప్పారు. ఈ నూతనంగా వచ్చే ఆకర్షణీయమైన కంప్యూటర్ ప్యాకేజీలు అంతా ఒక విచిత్రమైన కళ. అంతే.. మరి వధూవర గణ సమ్మేళనంలో నక్షత్ర పొంతన, కుజదోషం, వధూవరుల ఆయుస్థానం, ప్రవర్తన, సంతాన యోగం, బసుళ కళత్ర యోగము, కుటుంబ స్థానం, ఆరోగ్యం, మానసిక స్థితి వంటివి శోధించాలి. ఆయుర్భాగ్యం ప్రధానం. ఇక ఈ విషయమై స్ర్తి జాతకాధ్యాయంలో సౌభాగ్య స్థానం స్టడీ చేసే విధానం తెలిపారు. మరొక విషయం. కలహములు ఉంటాయా? లేవా? అనేది. భార్యాభర్తలు దూరంగా ఉంటారా? లేక ఒకేచోట ఉంటారా? అనేది కూడా శోధించాలి. ఇవి అన్నీ శోధించకుండా కేవలం పంచాంగాలలో రాసే నక్షత్ర పొంతన మరియు కంప్యూటర్ ప్యాకేజీలతో చూపే పర్సంటేజ్‌లు వాడుకొని వివాహ పొంతనలు చూద్దాం అని ప్రయత్నిస్తే సమయం వృధా అవుతుంది కానీ పనులు పూర్తి అవ్వవు.

కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు)
కామకోటినగర్, శంకరమఠం వీధి, నృసింహ కృప బిల్డింగ్, విజయవాడ - 520 012.

కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు)