రాష్ట్రీయం

నేడో రేపో గ్రేటర్ నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల నిర్వహణకు లక్షమంది
26 వేలమంది పోలీసులు
కోర్టు గడువులోగా ఎన్నికలు
డివిజన్‌కు ఇద్దరు పరిశీలకులు
నేటినుంచి వెబ్‌సైట్‌లో ఓటరు జాబితా
ఆన్‌లైన్‌లో నామినేషన్ల స్వీకరణ
ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్ 28: జిహెచ్‌ఎంసి ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా సజావుగా నిర్వహించేందుకు పోలీసులతోసహా మొత్తం లక్షమంది సిబ్బంది సేవలు వినియోగించుకోనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి నాగిరెడ్డి తెలిపారు. ఎన్నికలకు నియమించిన సాధారణ పరిశీలకులు, ఎన్నికల వ్యయ పరిశీలకులతో సోమవారం ఆయన ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి ఎన్నికల నిర్వహణకు హైకోర్టు విధించిన గడువు జనవరి 31లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే డివిజన్ల పునర్విభజన పూరె్తైందని, పోలింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేశామన్నారు. మరో రెండుమూడు రోజుల్లో డివిజన్ల రిజర్వేషన్లు తమకు అందుతాయని, వెంటనే ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని వివరించారు. ఎన్నికల నిర్వహణకు 26వేల మంది పోలీసులు, మరో 80వేల మంది వివిధ శాఖలకు చెందిన సిబ్బంది సేవలు వినియోగించుకోనున్నట్టు నాగిరెడ్డి తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న అతిపెద్ద ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయటం ద్వారా రాష్ట్ర ప్రతిష్ఠను పెంపొందించాలని పరిశీలకులకు సూచించారు. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలతో పోలిస్తే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఓటింగ్ శాతం అతి తక్కువగా నమోదవుతోందని, ఈసారి ఓటింగ్ నమోదు పెంచేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో గ్రేటర్ కమిషనర్ డాక్టర్ బి జనార్దన్‌రెడ్డి, అదనపు కమిషనర్ (ఎన్నికలు) సురేంద్రమోహన్, ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
ఎవరి ఓటు ఎక్కడుంది?
మహానగర ప్రజలు తమ ఓటు ఎక్కడ, ఏ పోలింగ్ స్టేషన్‌లో ఉందో తెల్సుకుని, ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా నేటి నుంచి గ్రేటర్ ఓటరు జాబితాను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పెట్టనున్నట్లు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ప్రజలు తమ ఓటు ఎక్కడుందో చూసుకోవటంతో పాటు ఓటరు స్లిప్‌లను కూడా ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని వివరించారు. ఈ వెబ్‌సైట్‌లోనే ఎన్నికల నిర్వహణ సమాచారం, నామినేషన్ల ఫారాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. నామినేషన్ ప్రతాలను వ్యక్తిగతంగా రిటర్నింగ్ అధికారికి గానీ, ఆన్‌లైన్‌లో గానీ సమర్పించుకోవచ్చునని తెలిపారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఒక్కో మున్సిపల్ డివిజన్‌కు ఇద్దరు పరిశీలకులను నియమించనున్నారు. ఒకరు సాధారణ పరిశీలకులుగా, మరొకరు అభ్యర్థి ఎన్నికల వ్యయ పరిశీలకులుగా విధులు నిర్వహించనున్నారు.
** సమావేశంలో మాట్లాడుతున్న నాగిరెడ్డి **