గ్రీన్‌కార్డ్ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శతృఘ్న రాయపాటి (యుఎస్‌ఎ) స్ట్ఫోనీ, జోసెలిన్ తారాగణంగా రమ్స్ దర్శకత్వంలో శ్రీనివాస్ గుప్తా, మోహన్.ఆర్, నరసింహ, నాగశ్రీనివాసరెడ్డి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘గ్రీన్‌కార్డ్’. ఈ గ్రీన్‌కార్డ్ సినిమా తొంభై శాతం అమెరికాలోనే చిత్రీకరణను జరుపుకుంది. ఇక్కడ నుండి అమెరికాకు వెళ్ళే వారు గ్రీన్‌కార్డ్ కోసం ఎన్ని తిప్పలు పడతారనే కానె్సప్ట్‌తో ఈ సినిమా రూపొందించబడింది. సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నాను నిర్మాత అన్నారు. దర్శకుడు రమ్స్ మాట్లాడుతూ- వీసా తీసుకుని అమెరికా చేరుకున్న ఓ కుర్రాడి కథే గ్రీన్‌కార్డ్. గత 15 సంవత్సరాలుగా నేను అమెరికాలో గమనించిన పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ కథను తయారుచేసుకున్నాను. పిల్లలను అమెరికాకు పంపాలనుకునే తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా ఇది. 90 శాతం సినిమాను అమెరికాలోనే చిత్రీకరించాను. నా నెక్స్ట్ మూవీని ఇండియాలోనే చిత్రీకరిస్తాను. గ్రీన్‌కార్డ్ ఆడియో విడుదలను అమెరికాలో కూడా చేశాం. సినిమా అంతా సరదాగా సాగిపోతుంది. లైఫ్ ఇన్ అమెరికాను, అమెరికాలో ఉన్నవారికి కూడా తెలియని చాలా విషయాలను ఇందులో చూపించబోతున్నాం. అలాగే ఇండియాలో కూడా అమెరికాలాగానే గన్‌కల్చర్ వచ్చేసింది. ఆ కల్చర్ పోవాలని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాను అన్నారు.