బిజినెస్

జిఎస్‌టి బిల్లుపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూపాయి మారకం విలువపైనా మదుపరుల చూపు
ఈ వారం మార్కెట్ సరళిపై నిపుణుల అంచనా

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)పై పార్లమెంట్‌లో చోటుచేసుకునే పరిణామాలపై ఆధారపడి నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ కదలికలు, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, విదేశీ మదుపరుల పెట్టుబడుల సరళి కూడా మార్కెట్ కదలికలను ప్రభావితం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచే అవకాశాలుండటంతో దాని ప్రభావంపై మదుపరుల దృష్టి అధికంగా ఉంటుందని విశే్లషిస్తున్నారు. ‘అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకునేంతదాకా మదుపరులు పెట్టుబడులపై ఆచితూచి వ్యవరిస్తారు.’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ రిసెర్చ్ అధిపతి హితేశ్ అగర్వాల్ అన్నారు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పడిపోతుండటంతో విదేశీ మదుపరులు పెట్టుబడులకు వెనకాడుతున్నారని పేర్కొన్నారు.
మరోవైపు ఈ శుక్రవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసిన అనంతరం విడుదలయ్యే అక్టోబర్ నెల పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) గణాంకాలూ మార్కెట్ తీరును శాసిస్తాయని తెలిపారు. కాగా, ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందుతుందని మదుపరులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నది తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జిఎస్‌టి బిల్లును అమల్లోకి తీసుకురావాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తుండగా, లోక్‌సభలో మెజారిటీ ఉన్నప్పటికీ, రాజ్యసభలో లేకపోవడం ప్రతిబంధకంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమవగా, ఈ పరిణామం మార్కెట్లను లాభాల్లో నడిపించింది. దీంతో జిఎస్‌టి బిల్లు పాసవడానికి ఉన్న అవకాశాలు ఎంతగా ఉంటే అంతగా మార్కెట్లు లాభాల్లో కదలాడుతాయన్న అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కాగా, వరుసగా రెండు వారాలపాటు లాభాలను అందుకున్న స్టాక్ మార్కెట్లు.. గత వారం మాత్రం నష్టపోయినది తెలిసిందే. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 26వేల స్థాయికి దిగువన, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 7,800 స్థాయికి దిగువన ముగిశాయి.