బిజినెస్

2016లో జిఎస్‌టి అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విశ్వాసం
కాంగ్రెస్ మద్దతుకు కొనసాగుతున్న ప్రయత్నాలు
ఏప్రిల్ 1న అమలు కాకపోతే పోయేదేం లేదని వ్యాఖ్య

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ప్రతిష్టాత్మక వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) విధానాన్ని వచ్చే ఏడాది ఆచరణలోకి తెస్తామన్న విశ్వాసాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు. రాజ్యసభలో జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందలేకపోతున్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో జిఎస్‌టి ఆమోదానికి సంబంధించి ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూనే ఉన్నామని, కాంగ్రెస్ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నామని జైట్లీ స్పష్టం చేశారు. పిటిఐకిచ్చిన ఇంటర్వ్యూలో సోమవారం ఆయన మాట్లాడుతూ ‘వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందుతుందని అనుకుంటున్నాను.’ అన్నారు. కాగా, కాంగ్రెస్ నేతృత్వంలోని గత యుపిఎ ప్రభుత్వ హయాంలోనే జిఎస్‌టి బిల్లును తీసుకురావాలని చూడగా, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి, ఇతర పార్టీలు వ్యతిరేకించాయి. ఇప్పుడు బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి రాగా, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అడ్డుకుంటోంది. బిజెపి ప్రతిపాదించిన జిఎస్‌టి బిల్లు లోపభూయిష్టంగా ఉందని, అభ్యంతరకర విధానాలున్నాయని కాంగ్రెస్ వాదిస్తోంది. లోక్‌సభలో తగినంత మెజార్టీ ఉన్నప్పటికీ, రాజ్యసభలో లేకపోవడంతో జిఎస్‌టి బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడం లేదు. మరోవైపు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జిఎస్‌టిని అమల్లోకి తీసుకురావాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మద్దతు కూడగట్టేందుకు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌తో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నట్లు జిఎస్‌టిలో ఒక శాతం అదనపు పన్ను తొలగింపునకు సిద్ధమని, పన్ను రేటు 18 శాతం మించబోదని కూడా జైట్లీ ఇప్పటికే చెప్పారు. ఇదిలావుంటే ఏప్రిల్ 1 నుంచి జిఎస్‌టిని అమల్లోకి తేవాలన్న ప్రభుత్వ లక్ష్యంపై జైట్లీ స్పందిస్తూ ‘జిఎస్‌టి.. ఆదాయపు పన్ను మాదిరి కాదు. అంతేగాక కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే దాన్ని అమలు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏడాదిలో ఎప్పుడైనా ఆచరణలోకి తేవచ్చు.’ అన్నారు.