బిజినెస్

జిఎస్‌టి బిల్లుపై చిగురించిన ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కెట్లలో రెండు రోజుల నష్టాలకు బ్రేక్
సెనె్సక్స్ 183 , నిఫ్టీ 52 పాయింట్లు వృద్ధి

ముంబయి, నవంబర్ 26: జిఎస్‌టి బిల్లుపై పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోతుందన్న ఆశల మధ్య మదుపరులు రియల్టీ, ఆటో, మెటల్ రంగాలకు చెందిన స్టాక్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడంతో రెండు రోజులుగా నష్టాలు చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం తిరిగి లాభాల్లో ముగిసాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ దాదాపు 183 పాయింట్లు లాభపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 52 పాయింట్లకు పైగా లాభపడింది. పలు బ్లూచిప్ కంపెనీల స్టాక్స్‌లో భారీ కొనుగోళ్ల కారణంగా గత రెండు రోజుల్లో దాదాపు 93 పాయింట్లు నష్టపోయిన సెనె్సక్స్ మళ్లీ లాభాల బాటలో పడింది. గురువారం ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కీలకమైన జిఎస్‌టి బిల్లుపై ఒక రాజీని సాధించవచ్చన్న ఆశలు మళ్లీ చిగురించడం మార్కెట్లో సెంటిమెంట్‌కు మంచి ఊతమిచ్చిందని బ్రోకర్లు అంటున్నారు. దీంతో సెనె్సక్స్ ఏకంగా 182.89 పాయింట్లు పెరిగి 25,958.63 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 22 కంపెనీల షేర్లు లాభాల్లో ముగిసాయి. నిఫ్టీ సైతం 52.20 పాయింట్లు పెరిగి 7,883.80 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నవంబర్ కాంట్రాక్ట్‌ల ముగింపు నేపథ్యంలో మదుపరులు షార్ట్ కవరింగ్‌కు దిగడం కూడా మార్కెట్ కోలుకోవడానికి దోహదపడింది. అంతర్జాతీయంగా ప్రధాన ఆసియా మార్కెట్ల సూచీల్లో మిశ్రమ ధోరణి కనిపించగా, ఐరోపా మార్కెట్లు ప్రారంభంలో లాభాల్లో మొదలైనాయి. టాటా మోటార్స్ షేరు అత్యధికంగా 5.61 శాతం లాభపడగా, సన్‌ఫార్మా షేరు దాదాపు 4 శాతం లాభపడింది. గెయిల్, ఐటిసి, మహింద్ర, మహింద్ర, రిలయన్స్ ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్ లాంటి ప్రధాన కంపెనీల షేర్లు లాభాలు ఆర్జించాయి. లండన్ మెటల్ ఎక్స్‌చేంజిలో ఉక్కు ధరలు కోలుకోవడంతో హిందాల్కో, టాటా స్టీల్ కంపెనీల షేర్లు 1.76 శాతం పెరిగాయి. అమెరికా ఎఫ్‌డిఏ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ తాజా ఔషధాలకు ఆమోదాన్ని నిలిపివేయవచ్చని, దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే కంపెనీ మందుల దిగుమతిని ఆపేయవచ్చన్న వార్తల కారణంగా ఆ కంపెనీ షేరు 8.2 శాతం పడిపోయింది. బహిరంగ మార్కెట్లో 23 లక్షల షేర్లను కొనుగోలు చేయడం ద్వారా ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం డిఎల్‌ఎఫ్‌లో తమ వాటాను ప్రమోటర్లు పెంచుకోవడంతో ఆ కంపెనీ షేరు దాదాపు 6 శాతం పెరిగింది. అలాగే ఐడియా, వీడియోకాన్ సంస్థల మధ్య స్పెక్ట్రమ్ ఒప్పందం కారణంగా ఆ రెండు సంస్థల షేర్ల ధరలు సైతం 5.2 శాతం పెరిగాయి.