బిజినెస్

పార్లమెంట్‌లో జిఎస్‌టి బిల్లు పాసవుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి జయంత్ సిన్హా ఆశాభావం
న్యూఢిల్లీ, నవంబర్ 28: కాంగ్రెస్ నాయకత్వంతో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమైన నేపథ్యంలో జిఎస్‌టి బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందుతుందన్న ఆశాభావాన్ని శనివారం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా వ్యక్తం చేశారు. ఇక్కడ జరిగిన పిహెచ్‌డి చాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సెషన్‌కు హాజరైన ఆయన మాట్లాడుతూ జిఎస్‌టి త్వరలో అమల్లోకి వస్తుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జిఎస్‌టిని ఆచరణలో పెట్టాలని కేంద్రంలోని మోదీ సర్కారు సిద్ధమవుతున్నది తెలిసిందే.