ఆంధ్రప్రదేశ్‌

ఆర్థిక వ్యవస్థకు బలమైన ఊతం .. జీఎస్టీ బిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: డబుల్ టాక్సేషన్‌ను విధానికి స్వస్థి చెప్పే కొత్త చట్టమే జీఎస్టీ అని, భవిష్యత్‌లో ఆర్థిక వ్యవస్థకు ఈ బిల్లు బలమైన ఊతం అందిస్తుందని సీఎం చంద్రబాబు గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అన్నారు. ఈ బిల్లు ద్వారా వినియోగదారులు పన్ను భారం తగ్గే అవకాశం ఉందని, ధరలు కూడా తగ్గే పరిస్థితి ఉంటుందని తెలిపారు. జీఎస్టీ బిల్లును సభలో ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబు బిల్లుపై చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ బిల్లు ద్వారా ఆదాయం పెరుగుతుందని, అయితే ప్రారంభంలో పలు ఇబ్బందుల రావడం సహజమన్నారు. టాక్స్ తగ్గింపుపై కేంద్రం 5 సంవత్సరాలు గ్యారెంటీని సైతం ఇచ్చిందని తెలిపారు. పార్లమెంటు ఆమోదం తెలిపిన జీఎస్టీ బిల్లును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో ప్రవేశపెట్టి ప్రసంగించారు. సభలో వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగింది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైసీపీ సభ్యులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.