హైదరాబాద్

గుడిసెలు లేని నగరంగా హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖ్యమంత్రి కేసిఆర్ హామీ
నేరేడ్‌మెట్, జూన్ 5: రాబోయే నాలుగేళ్లలో హైదరాబాద్ మహానగరంలో గుడిసెలు లేకుండా అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తానని తెలంగాణ సిఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని లక్ష్మీసాయిగార్డెన్‌లో ఏర్పాటు చేసిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని జీవోనెం 58 కింద పేదలందరికీ ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా సిఎం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా శుక్రవారం గ్రేటర్ పరిధిలో లక్షా ఇరవై ఐదు వేల మంది పేదప్రజలకు పదివేల కోట్ల రూపాయలు విలువచేసే ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా పట్టాలకు సంబంధించి మూడు లక్షల ముపై ఆరువేల దరఖాస్తులు అందాయని వాటిలో లక్షా ఇరవై ఐదువేల మందికి మొదటి విడతగా పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. జంటనగరాలలో దాదాపురెండు లక్షల మంది ఇళ్లులేక దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నారని తెలిపారు. క్లబ్‌లు, రేసుకోర్సుల మిగతా వాటికి వేల ఎకరాల స్థలాలు ఉన్నాయని పేదవాడికి ఉండటానికి కనీసం ఇంటి స్థలం కూడా లేదన్నారు. గత ప్రభుత్వాలు పేదల గుడిసెలు కూల్చివేస్తే టిఆర్‌ఎస్ ప్రభుత్వం వారికి ఉన్న చోటే పక్క ఇల్లు నిర్మిస్తోందన్నారు.
ఇళ్లు నిర్మించుకోవడానికి బ్యాంకుల నుండి ఎలాంటి రుణాలు లేకుండా ప్రభుత్వం సొంత ఖర్చుతో ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండువేల మంది దళితులకు భూములు పంపిణీ చేశామని తెలిపారు. పట్టాలు రాని వారు బాధపడవద్దని అందరికీ పట్టాలు ఇచ్చే బాధ్యత తనదేనని సిఎం భరోసా ఇచ్చారు. గతంలో వేసవి వచ్చిదంటే కరెంటు కష్టాలు ఉండేవని, తమ ప్రభుత్వం వచ్చాక వేసవిలో పవర్‌కట్ లేకుండా చేశామన్నారు. రాబోయే కాలంలో కనురెప్ప పాటు కూడా కరెంటు కోత ఉండదన్నారు. పేదల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందన్నారు. ప్రజా సమస్యలు ఉంటే అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే అధికారులనే ప్రజల వద్దకు పంపిస్తామన్నారు.మంత్రులు కడియం శ్రీహరి, పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కనకారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు.