రాష్ట్రీయం

గురజాడ రచనలు హిందీలోకి అనువదించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వానికి యార్లగడ్డ సూచన * గురజాడ విశిష్ట పురస్కారం ప్రదానం

విజయనగరం,నవంబర్ 30: మహాకవి గురజాడ రచనలను హిందీ భాషలోకి అనువదించి ఆయన ఖ్యాతిని దేశవ్యాప్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రముఖ సాహితీవేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. విజయనగరంలోని ఆనందగజపతి ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన గురజాడ శతవర్ధంతి కార్యక్రమంలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రకటించిన గురజాడ విశిష్ట పురస్కారాన్ని యార్లగడ్డ అందుకున్నారు. విదేశీ వ్యామోహంలో పడి మనం మన తెలుగు భాష ఔన్నత్యాన్ని మరచి పోవడం తగదన్నారు. మాతృభాషను ప్రేమించాలని తెలిపారు. ఆంగ్లభాషలో పాండిత్యం సంపాదించినా తెలుగు భాష గొప్పదనాన్ని విస్మరిస్తే అంతకన్నా ప్రమాదం ఇంకోటి ఉండదని ఆనాడే గురజాడ చెప్పారని అన్నారు. పరభాషా వ్యామోహానికి అడ్డుకట్ట పడాలని చెప్పారు. గురజాడకు విశ్వకథకునిగా గుర్తింపు రాకపోవడానికి ఆయన రచనలు వింద్యపర్వత శ్రేణులు దాటకపోవడం కారణమని చెప్పారు. గురజాడ రచనలు 500 పేజీలు ఉంటాయని, ఈప్రాజెక్టును తప్పక స్వీకరిద్దామని ఆయన కోరారు. గురజాడ ఇంటిని ప్రజల వారసత్వ సంపదగా నిలబెట్టిన గురజాడ కుటంబసభ్యులను అభినందించారు. కార్యక్రమంలో రచయిత గొల్లపూడి మారుతీరావు మాట్లాడుతూ గురజాడ రచనల్లో విశిష్టతలను తనదైన బాణీలో వివరించారు. గురజాడ శతవర్ధంతి వేడుకల్లో పాల్గొన లేక పోయిన కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అభినందన సందేశాలు పంపారు. (చిత్రం) యార్లగడ్డకు గురజాడ పురస్కారం ప్రదానం చేస్తున్న దృశ్యం