34 పాత్రలతో చల్ చల్ గుర్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శైలేష్ బొలిశెట్టి, దీక్షాపంత్, అంగనారాయ్ ప్రధాన తారాగణంగా మోహన్‌ప్రసాద్ దర్శకత్వంలో మారిశెట్టి రాఘవయ్య రూపొందిస్తున్న చిత్రం ‘చల్ చల్ గుర్రం’. డీటిఎస్ కార్యక్రమాలు జరుపుకుంటున్న చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు మోహనప్రసాద్ చిత్ర విశేషాలను వివరిస్తూ చల్ చల్ గుర్రంలో దాదాపు 34 పాత్రలుంటాయి. కానీ ఏ పాత్రా మరో పాత్రతో రక్తసంబంధం కలిగి ఉండకపోవటం విశేషం. ఇదొక యునీక్ కానె్సప్ట్. మనుషుల మధ్య వస్తు సంబంధం కాకుండా సంస్కార బంధం ఉండాలన్న కోణంలో.. పూర్తిగా కార్పొరేట్ బ్యాగ్రౌండ్‌లో క్లాసిక్ కామెడీగా తీర్చిదిద్దుతున్నాం. కుటుంబ కథా నేపథ్యంగా సాగే సినిమాలో ప్రతి అంశమూ ఆడియన్స్‌కి కొత్త అనుభూతినిస్తుంది. 5 పాటల్ని ఐదు జోనర్స్‌లో చేశాం. సంగీత దర్శకుడు వెంగి బాణీలు చిత్రాన్ని హైట్స్‌కు తీసుకెళ్తుంది. హీరో శైలేష్ కొత్తవాడైనా ఎక్కడా ఆ ఛాయలు కనపడకుండా నటించాడు. సహజంగానే కారు రేసర్ అయన హీరో, సినిమాలో మంచి డాన్సులతోపాటు నటనలో ఈజ్ చూపించాడు. ఇక నాగబాబు పాత్ర సినిమాకు హైలెట్. ఈ సినిమా కథ చెప్పినప్పుడు సరైన మసాలా లేదని ఒకింత పెదవి విరిచినా, అవన్నీ అండర్‌డెప్త్‌లో వివరించడం జరిగింది. ఈ స్టోరీ ఏ భాషలో చేసినా హిట్ ఖాయం. తెలుగువారికోసం ఆచార సంప్రదాయాలను పాటిస్తూ, సినిమాను రూపొందించాం. వంట కొత్తది. తెలుగు వారికి నచ్చే విధంగా వార్చాం. సినిమాలో పాత్రలన్నీ నా నిజ జీవితంలో చూసినవే. అందుకే కథను పకడ్బందీగా అల్లుకోగలిగాను. ప్రతి డైలాగ్‌లో కామెడీ వినిపిస్తుంది. కానీ దాని వెనుక కొన్ని నగ్నసత్యాలు ఉంటాయి. అలా ఈ చిత్రాన్ని క్లాసిక్ కామెడీగా రూపొందించాను. ఈవారంలో తొలి కాపీ సిద్ధమవుతోంది అన్నారు.
వైజాగ్, హైదరాబాద్‌లలో షూటింగ్ పూర్తి చేసుకున్న చల్‌చల్ గుర్రం, డీటీఎస్ జరుపుకుంటోంది. ఒక సన్నివేశంలో వచ్చే చివరి డైలాగ్‌తోనే ఆ సీన్ తరువాత వచ్చే పాట మొదలయ్యే డిఫరెంట్ కానె్సప్ట్‌ను డిజైన్ చేయడం మరో విశేషం. సంగీత సాహిత్యాలు సమవుజ్జీలుగా ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ నెలలోనే ఆడియో విడుదల చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర యూనిట్ చెబుతోంది. నాగబాబు, ముఖ్తార్‌ఖాన్, ప్రవీణ్, బెనర్జీ, అశోక్‌కుమార్, జోగిబ్రదర్స్, తిరుపతిప్రకాష్, సుడిగాలి సుధీర్, అంబటి శ్రీను, వైవా హర్ష తదితరులు నటించిన చిత్రానికి కెమెరా: శ్యామ్‌ప్రసాద్, సంగీతం: వెంగి, ఎడిటింగ్: శంకర్, ఆర్ట్: జె.కె.మూర్తి, డాన్స్: రఘుమాస్టర్, ప్రదీప్, ఆంథోని, భాను, ఫైట్స్: రామ్ సుంకర, నిర్మాత: మారిశెట్టి రాఘవయ్య, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహనప్రసాద్. (చిత్రం) శైలేష్ బొలిశెట్టి