నల్గొండ

ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే ఎమ్మెల్సీగా పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* గుత్తా పురుషోత్తంరెడ్డి
నల్లగొండ , డిసెంబర్ 18: ఎంపిటిసి, జడ్‌పిటిసి, కౌన్సిలర్ల ఆత్మగౌరవాన్ని నిలపేందుకు, శాసనమండలిలో ప్రజాసమస్యలు పరిష్కారానికై తమ గళాన్ని వినిపించేందుకే ఎమ్మెల్సీగా తాను పోటీ చేస్తున్నానని తనను గెలిపించాలని ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్ధి గుత్తా పురుషోత్తంరెడ్డి కోరారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఎంపిటిసిగా గెలుపుకు ముందు ప్రజలకు అనేక హామిలు ఇచ్చి గెలిచామని, రెండు, మూడు గ్రామాలకు ఒక ఎంపిటిసిగా ఉండి కనీసం మండల పరిషత్‌లో ప్రాధాన్యత లేకుండా ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపిటిసిల సమస్యల సాధనకు గతంలో 6వేల మందితో రవీంద్రభారతిలో సదస్సు నిర్వహించామని, ఇందిరాపార్క్ వద్ద 4వేల మంది ఎంపిటిసిలతో ధర్నాలు చేసి గౌరవ వేతనం రూ.750నుండి రూ.5వేలకు పెంచడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సాధించామన్నారు. మండల పరిషత్‌లో అభివృద్ది పనుల కోసం ఎంపిటిసిలకు సైతం ప్రాధాన్యత ఇచ్చి రూ.20లక్షల నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. బిఆర్‌జిఎఫ్, ఎంఆర్‌జిఎఫ్, 14వ ఆర్ధిక సంఘం నిధులలో 30శాతం, 20శాతం విధానాన్ని పునరుద్దరించేందుకు కృషిచేస్తానని హామి ఇచ్చారు. ఎంపిటిసి, జడ్‌పిటిసి, కౌన్సిలర్ల సమస్యలపై అవగాహన ఉండేవారిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే అనేక ప్రజాసమస్యలతోపాటు తమ సమస్యల పరిష్కారానికి కృషిచేసే అవకాశం ఉంటుందని, అత్యధిక మెజారిటితో తనను గెలిపించాలని కోరారు. తాను ఎంపిటిసిల హక్కులు కాపాడే లక్ష్యంగా పనిచేస్తానని, ప్రజలు డబ్బు రాజకీయాలను అర్ధం చేసుకోని స్తానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని, 1100మంది ఓటర్లలో 835మంది సభ్యులలో 300మందికి పైగా నాకే అనుకూలంగా ఉన్నారని, 700ఓట్లతో గెలిచి శాసనమండలిలో తన గళాన్ని వినిపిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో కసిరెడ్డి మహేందర్‌రెడ్డి, ఎ.నర్సిరెడ్డి, అశోక్‌రెడ్డిలు పాల్గొన్నారు.