విశాఖపట్నం

కమర్షియల్ కాంప్లెక్స్‌ల నుంచి చెత్త సేకరణకు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* శతశాతం ఇంటింట చెత్త సేకరణ జరగాలి
* స్వచ్ఛ విశాఖకు అందరి తోడ్పాటు అవసరం
* జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్
విశాఖపట్నం, నవంబర్ 27: జివిఎంసి పరిధిలోని వాణిజ్య సముదాయాలు, హోటల్స్ తదితర భారీ భవనాల నుంచి చెత్త సేకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన 40వ వార్డు మర్రిపాలెం మెయిన్‌రోడ్డు, గొల్లవీధి, కంచరపాలెం ఫ్లైఓవర్, ఆర్‌పి పేట తదితర ప్రాంతాల్లో సందర్శించారు. వాణిజ్య సముదాయాల నుంచి చెత్తను సేకరించేందుకు అదనపు వాహనాలు, టిప్పర్లు అవసరం అవుతాయని జోనల్ కమిషనర్ నాగనరసింహారావు వివరించారు. దీనిపై స్పందించి కమిషనర్ అన్ని వార్డుల నుంచి ప్రతిపాదనలు సేకరించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని జెడ్సీలను ఆదేశించారు. మర్రిపాలెం మెయిన్‌రోడ్డులో కాలువ పూడికతో నిండిపోయి ఉండటాన్ని గమనించిన కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువకు మరమ్మతులు చేపట్టి మురుగునీరు సక్రమంగా పారేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే ఇంటింటా చెత్త సేకరణ కార్యక్రమం నిర్వహణపై స్థానికులను ఆరా తీశారు. చెత్త సేకరణ సక్రమంగా లేదని కాలనీ వాసులు చెప్పడంతో పారిశుద్ధ్య కార్మికుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పిన్‌పాయింట్ ప్రకారం చెత్త సేకరణ జరగాలని, అందుకు యంత్రాంగం పర్యవేక్షణ అవసరమని సూచించారు. ఆర్‌పి పేట ఫ్లైఓవర్ వద్ద మురుగు కాలువ నిర్వహణ, రహదారిపై గోతులను తక్షణమే పూడ్చాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆయన వెంట హార్టీకల్చర్ ఎడి దామోదర్, ఇఇలు వేణుగోపాల్, ఇతర అధికారులు ఉన్నారు.