బిజినెస్

హైదరాబాద్‌లో 7,800 మంది శ్రీమంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 24: ఆసియా-పసిఫిక్ దేశాల్లో అత్యధికంగా శ్రీమంతులున్న టాప్-20 నగరాల్లో ముంబయి, ఢిల్లీ ఉన్నాయి. ఒక మిలియన్ డాలర్లు (ప్రస్తుతం భారత కరెన్సీ ప్రకారం దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలు), అంతకంటే అధికంగా సంపద ఉన్నవారితో న్యూ వరల్డ్ వెల్త్ సంస్థ రూపొందించిన ఆసియా-పసిఫిక్ 2016 సంపద నివేదిక ప్రకారం టాప్-20లో తొలి స్థానాన్ని జపాన్ రాజధాని టోక్యో దక్కించుకుంది. ఇక్కడ 2,64,000 శ్రీమంతులు ఉన్నారు. ఇక 41,200 మందితో ముంబయి 12వ స్థానంలో, 20,600 మందితో ఢిల్లీ 20వ స్థానంలో నిలిచాయి. హైదరాబాద్‌లో 7,800 మంది ఉన్నట్లు జాబితా పేర్కొంది. అలాగే జాబితాలో కోల్‌కతా (8,700), బెంగళూరు (6,700), చెన్నై (6,000), పుణె (3,800), అహ్మదాబాద్ (3,700) ఉన్నాయి. కాగా, మల్టీ మిలియనీర్ల విషయానికొస్తే ముంబయిలో 2,690 మంది ఉన్నారు. దీనికి సంబంధించిన జాబితాలో ముంబయికి 8వ స్థానం లభించగా, ఢిల్లీ 1,340 మందితో 14వ స్థానాన్ని సొంతం చేసుకుంది. 9,650 మందితో హాంకాంగ్ మొదటి స్థానం పొందింది. కనీసం 10 మిలియన్ డాలర్లు (్భరత్ కరెన్సీ ప్రకారం సుమారు 65 కోట్ల రూపాయలు), అంతకంటే అధికంగా సంపదగలవారితో ఈ జాబితాను న్యూ వరల్డ్ వెల్త్ తయారు చేసింది. కాగా, హైదరాబాద్‌లో 510 మంది మల్టీ మిలియనీర్లుండగా, కోల్‌కతాలో 560 మంది, బెంగళూరులో 430 మంది, చెన్నై లో 390 మంది, పుణెలో 240 మంది, అహ్మదాబాద్‌లో 230 మంది ఉన్నారు. ఆసియా-పసిఫిక్ దేశాల్లో కోటీశ్వరుల జనాభాలో భారత్ నాలుగో స్థానంలో ఉన్నది తెలిసిందే. మొత్తం 2.36 లక్షల మంది ఉన్నారు. 12,60,000 మందితో జపాన్ తొలి స్థానంలో, 6,54,000 మందితో చైనా రెండో స్థానంలో, 2,90,000 మందితో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉన్నాయి.