బిజినెస్

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాభం రూ. 3,359 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 25: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో గతంతో పోల్చితే 20.1 శాతం పెరిగింది. 3,358.8 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌లో 2,794.51 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 18,283.31 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 14,930 కోట్ల రూపాయలుగా ఉంది. ఇకపోతే ఈసారి నికర వడ్డీ ఆదాయం 24 శాతం ఎగిసి 7,068.5 కోట్ల రూపాయలుగా ఉంది. ఇతర ఆదాయం 13.3 శాతం క్షీణించి 2,872.2 కోట్ల రూపాయలుగా ఉండగా, ఇందులో కోర్ ఫీ, కమిషన్ ఆదాయం క్రిందటిసారితో చూస్తే 1,806.5 కోట్ల రూపాయల నుంచి 2,004.8 కోట్ల రూపాయలకు చేరింది. ఈ మేరకు సోమవారం సంస్థ తెలియజేసింది.