భక్తి కథలు

హరివంశం 48

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపాత్ములారా! మిమ్మల్ని అంతమొందిస్తాను అని హేలగా వాటిమీదికి ఉరికాడు కృష్ణుడు. ఇంత కాలానికి మా కోరిక తీరబోతున్నదని పూర్వ వైరం తలపుకు వచ్చి మహా రోషంతో అని కృష్ణుణ్ణి చుట్టుముట్టాయి. రంకెలు వేస్తూ గిట్టలు నేలమీద ధట్టిస్తూ అవి ఆయనను పొడవటానికి వచ్చాయి.
ఇట్లా అవి తనను సమీపించగానే అరచేతి తాపులతో వాటి మూతులు పగలకొట్టాడు కృష్ణుడు. అవి ఒకటి తరువాత ఒకటి వెనుకకు ఒదగగానే ఒకదాని కొమ్ములు పట్టుకొని ఇంకొకదానిపై త్రోశాడు. అవి బెదిరి బెదిరి వెనక్కు తిరుగుతుంటే తోకలు పట్టుకొని మెలిపెట్టి మెలిపెట్టి నేలకు ఒరిగేట్లు చేశాడు. అవి ఎట్లానో తూలుతూ సోలుతూ లేచి మళ్లీ మీదికి వస్తుంటే కత్తిపోట్లతో వాటి గండస్థలాలు రక్త్ధారలు రగిలేట్లు చేశాడు. వాటి వీపులు పిడికిటిపోట్లతో అణిగిపోయేట్లు ప్రహరించాడు. తోకలు పట్టుకొని గుంజి గుంజి అవి ఆర్తనాదాలు చేసేట్లు చేశాడు. ఈ విధంగా భూమి మీద అవి నిలబడలేనంతగా చేసి చంపివేశాడు అన్నిటినీ.
ఆ మహాసాహసాన్ని, వినోదప్రాయంగా వాటిని విధించటాన్ని చూసి ఒక పక్క భయమూ వేరొక పక్క సంతోషమూ, వీటిని మించి మహా విస్మయమూ ముప్పిరికొనగా అక్కడ ఆ దృశ్యాన్ని చూస్తున్న వారంతా నిర్నిమేషులైపోయినారు. నివ్వెరతో నిశే్చష్టులైనారు. కాలనేమి సుతులిట్లా కాలగతి పొందారు. ఒక్కొక్క ఆబోతును దాని ముట్టె పగిలిపోయేట్లు కొట్టి పిడికిడిపోట్లతో దాని పక్కలు బదాబదలు చేసి నేలపై పడవేసి ఈడ్చి సంరంభించటం చూసి నీల ఉద్వేగంతో ఆనందంతో ఆశతో, సిగ్గుతో, శృంగార విలాస వదనరోచులతో చూడటం శ్రీకృష్ణుడికి ఆ ఆబోతులను వధించటంలో మరింత ఉత్సాహం, ఉల్లాసం, ఉత్సుకత పెంపుచేశాయి.
అపుడు మహా సంతోషంతో ఉప్పొంగిపోతూ కుంభకుడు నీల చెయ్యి పట్టుకుని ఆమెను నెమ్మదిగా అడుగులు వేయిస్తూ శ్రీకృష్ణుడి దగ్గరకు తీసుకొని వచ్చి ఈమె వీర్యశుల్క మాత్రమే కాక నీ మేన మరదలు కూడానూ. నిన్ను వరించింది అని నీల చేయి కృష్ణుడి చేతిలో ఉంచాడు. అలనాడు రామచంద్ర ప్రభు జనకుడు తనకివ్వగా జానకిని వరించినట్లు కృష్ణ చంద్రుడు కూడా నీలను పరమానురాగ ప్రహృష్ట హృదయుడై స్వీకరించాడు. శ్రీకృష్ణుడికి చీని చీనాంబరాలు, ఆభరణాలు సమర్పించాడు కుంభకుడు.
యశోదానందులకు అమూల్యమైన కట్నాలు చదివించాడు. తక్కిన గోప కుమారులకు కూడా మర్యాదలు చేసి సత్కరించాడు. ఇంకా ఆనందం పట్టలేక నందుడితో ‘బావా! నీ కొడుకు మమ్ముల్నందరినీ కాపాడాడు. ఇంతటి భుజ బల పరాక్రమ శోభితుడయ్యాడు కృష్ణుడు. ఇక మేమంతా నీ దయవల్ల సుఖంగా జీవిస్తాము. చూడు! బావా వేలు, పదివేలు, లక్షలు గోవులు నీలకు అరణంగా ఇపుడే తోలిస్తాను. మాకు ఎందుకు? మాకు లేవా అనకూడదు నీవు. నా ముద్దు ముచ్చట్లు ఎంత మాత్రం కాదనకూడదు సుమా!
నీవు స్వీకరిస్తే కాని నాకు తృప్తిగా ఉండదు అని నందుడుణ్ణి, కుంభకుడు వేడుకున్నాడు. అపుడు నందుడు కూడా ప్రేమానురాగ ఆదరాభిమానాలతో ‘నాకు అసంఖ్యాకమైన ఆలమందలున్నాయి కదా! గొడ్డూ, గోదకు నాకు కొదవేమున్నది! తగని పాడి పంటలున్నాయి. బోలెడు మేక మందలున్నాయి. పాడి గొర్రెలున్నాయి. బర్రెలున్నాయి. కృష్ణుడు పుట్టినప్పటినుంచి గో సంపద ఏడేడూ అపరిమితంగా వృద్ధి పొందుతున్నది. కడవలకొద్దీ పాలూ, బానలకొద్దీ నెరుూ్య మాకు రోజూనూ. ఇక మా నివాసారణ్యాలలో పూలు పండ్లు తేనెలు కొల్లలుగా ప్రతివారికిన్నీ లభిస్తూనే ఉన్నాయి.

ఇంకాఉంది