హాలీవుడ్ సినిమాలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ నటుడిగా గుర్తింపు తెచ్చుకుని విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకున్న నటుడు కమల్‌హాసన్. లోకనాయకుడిగా పేరు తెచ్చుకున్న కమల్‌కు ఎప్పటినుంచో ఓ కోరిక వుందని అర్థమవుతోంది. ఆ కోరిక ఏంటంటే, హాలీవుడ్ సినిమాలో నటించడం. ఈమధ్య భారతీయ నటులు హాలీవుడ్‌లో కూడా తమ హవాను సృష్టించుకుంటున్నారు. తాజాగా కమల్ కూడా ఓ సినిమాకు శ్రీకారం చుట్టారని తెలిసింది. ఇందులో తానే నటిస్తూ దర్శకత్వం కూడా చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. తన స్నేహితులతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించే ఆలోచనలో వున్నాడట కమల్‌హసన్. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. హాలీవుడ్ స్థాయిలో ఆస్కార్ అవార్డు పొందాలనే కోరిక ప్రతి ఒక్కరికీ వుంటుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆమధ్య మరుద నాయగం చిత్రం మళ్లీ మొదలవుతుందని వార్తలొచ్చినా, భారీ బడ్జెట్ కారణంగా అది సాధ్యంకాదని చెప్పాడు కమల్. మరి ఈ హాలీవుడ్ సినిమాతోనైనా ఆయన కోరిక తీరుతుందేమో చూడాలి!