జాతీయ వార్తలు

హురియత్ నేత జిలానీకి బెదిరింపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఫిబ్రవరి 14: అఖిల భారత హురియత్ కాన్ఫరెన్స్ వేర్పాటువాద వర్గం చైర్మన్ సయ్యద్ అలీ షా జిలానీకి అండర్ వరల్డ్ డాన్ రవి పూజారినుంచి చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయని ఆదివారం మీడియా కథనాలు పేర్కొన్నాయి. పూజారి శ్రీనగర్‌లోని హైదర్‌పోరాలో ఉన్న హురియత్ కాన్ఫరెన్స్ కార్యాలయం లాండ్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి జిలానీని చంపేస్తామని బెదిరించాడని హురియత్ కాన్ఫరెన్స్ ప్రతినిధి అయాజ్ అక్బర్ చెప్పినట్లు పాకిస్తానీ దినపత్రిక ‘ది నేషన్’ తెలిపింది. ఫోన్‌లో పూజారి గొంతు అనాగరికంగా, బూతులతో కూడుకుని ఉందని కూడా ఆయన చెప్పారని ఆ పత్రిక తెలిపింది. ఇలాంటి బెదిరింపులెన్ని వచ్చినప్పటికీ జిలానీ కాశ్మీర్ ప్రజల స్వేచ్ఛకోసం తన పోరాటాన్ని కొనసాగిస్తారని కూడా అక్బర్ చెప్పారు. కాగా, జిలానీకి పూజారి బెదిరింపులు అనేక అనుమానాలను లేవనెత్తుతోందని, భారత ప్రభుత్వం, అక్కడి మతతత్వ శక్తుల మద్దతు ఆయనకు ఉందనే విషయాన్ని ఇది స్పష్టంగా సూచిస్తోందని అక్బర్ అన్నారని కూడా ఆ పత్రికా కథనం పేర్కొంది. అంతేకాదు జిలానీకి ఏమయినా జరిగితే భారత ప్రభుత్వానిదే బాధ్యత అవుతుందని కూడా ఆయన అన్నారు. ఈ విషయంపై న్యాయ నిపుణులను సంప్రదించే విషయాన్ని కూడా తమ సంస్థ పరిశీలిస్తోందని అక్బర్ చెప్పారు. రవి పూజారి ఒక అనాగరిక, థర్డ్‌గ్రేడ్ గూండా అని, భారత దేశంలో అసహనం పెరిగిపోతున్న నేపథ్యంలో జిలానీని చంపేస్తానని అతను బెదిరించడం ఆందోళన కలిగించే అంశమని కూడా ఆయన అన్నారు.