తెలంగాణ

రేపు కేంథ్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ముఖ్యమంత్రి కెసిఆర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: దంత చికిత్స కోసం నాలుగు రోజుల కిందట ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పనిలో పనిగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్రంతో చర్చించాలని నిర్ణయించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలకు మొండి చెయ్యి, విభజన హామీల విస్మరణ తదితర అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో శుక్రవారం భేటీ కాబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు ఆర్థిక సాయం అందించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసిన కేంద్రం విస్మరించడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ విషయాన్ని టిఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్ లోపల, వెలుపల బహాటంగానే కేంద్రం వైఖరిని తప్పుపట్టిన విషయం తెలిసిందే. దేశంలోనే వినూత్నంగా చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను కేంద్ర మంత్రులతో పాటు ఇతర రాష్ట్రాలు ప్రశంసించినప్పటికీ చిల్లిగవ్వ కేటాయించకలేదు. తమ పథకాలకు నిధులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు కనీసం రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీలను సైతం విస్మరించడాన్ని టిఆర్‌ఎస్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. ఎంపీలు తమ అసంతృప్తిని బహాటంగానే వ్యక్తం చేసినప్పటికీ ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం స్పందించలేదు. ఈ అంశాన్ని నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోనే ముఖ్యమంత్రి చర్చిస్తారని టిఆర్‌ఎస్ వర్గాల సమాచారం. నాలుగు రోజులుగా ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉన్నప్పటికీ ప్రధానితో భేటీ కాలేకపోయారు. ముందుగానే ఖరారైన కార్యక్రమాలు, విదేశీ పర్యటనల కారణంగా ప్రధానితో ముఖ్యమంత్రి భేటీ కాలేకపోయినట్టు సమాచారం. దీంతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతోనైనా సమావేశమై బడ్జెట్ కేటాయింపులలో తెలంగాణను విస్మరించడంపై ముఖ్యమంత్రి చర్చించనున్నట్టు తెలిసింది. అలాగే వ్యవసాయానికి ఉచిత పెట్టుబడి పథకం మే నెలలో ప్రారంభం కానుంది. ఈ పథకం ద్వారా సుమారు నాలుగు వేల కోట్లను రైతులకు పంపిణీ చేయాల్సి ఉండటంతో నగదు కొరత ఏర్పడకుండా చూడాల్సిందిగా అరుణ్ జైట్లీని ముఖ్యమంత్రి కోరనున్నారని టిఆర్‌ఎస్ వర్గాల సమాచారం. శుక్రవారం అరుణ్ జైట్లీతో ముఖ్యమంత్రి భేటీ ఖరారు కావడంతో ఆర్థికశాఖ అధికారులను ఢిల్లీకి రావాల్సిందిగా ఢిల్లీ నుంచి సిఎంఓ అధికారులు కోరినట్టు తెలిసింది.